మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దాదాపు అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము వసూలవుతుంది. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాల్లో దూసుకుపోతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగం మారాలనుకుంటున్నవారు విదేశాల నుంచి శుభ వార్తలు వినే సూచనలున్నాయి.