- Telugu News Photo Gallery Spiritual photos Maha Kumbha Mela 2025: ttd setting a replica of the tirumala temple in maha kumbh mela 2025 in prayag raj opening on jan 14th
Tirumala: అక్కడ అచ్చం తిరుమల శ్రీవారి ఆలయమే.. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ కూడా అన్ని కైంకర్యాలు..
అచ్చం తిరుమల శ్రీవారి ఆలయమే మరో చోట ఇప్పుడు దర్శనం ఇస్తోంది. తిరుమల ఆలయంలో జరిగే నిత్య కైకర్యాలు, నివేదనలు అక్కడ జరగబోతున్నాయి. ఈ నెల 13 నుంచి తిరుమల వెంకన్న ఆలయం భక్తులకు అక్కడ అందుబాటులోకి రాబోతుంది. ఇంతకీ ఎక్కడ ఉన్నదే భక్తుల సందేహం. అది ఎక్కడో కాదు మహా కుంభమేళా జరిగే ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోనే.
Updated on: Jan 11, 2025 | 8:17 PM

మహా కుంభమేళా లో శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించిన టీటీడీ జనవరి 8న తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కు శ్రీవారి కళ్యాణ రథాన్ని పంపింది.

హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ ప్రయాగ రాజ్ వద్ద జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు ప్రతిష్టాత్మకంగా కుంభమేళా జరగనుంది.

కుంభ మేళకు వచ్చే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిచింది.

ప్రయాగ్‌రాజ్ లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయ సమీపం లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు అయ్యింది.

ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించనుంది. ప్రతిరోజు తిరుమల తరహా లో నిత్యం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహించనుంది.

జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు కూడా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

మహా కుంభమేళా లో శ్రీవారి నమూన ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పన కు టీటీడీ నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని టీటీడీ ఇప్పటికే ప్రయాగ్ రాజ్ కు పంపింది

ప్రయాగ్ రాజ్ కు చేరిన శ్రీవారి రథం : ఇక తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం ఇప్పటికే అహ్మదాబాద్ చేరింది. ఈ నెల 8న మహా కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కల్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి లు పూజలు నిర్వహించి ప్రారంభించారు.

170 మంది టీటీడీ అర్చకులు తో కలిపి సిబ్బంది నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారని టీటీడీ పేర్కొంది. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు చెబుతోంది.




