కిమ్ చేతిలో డేంజరస్ అస్త్రం..నేరుగా అమెరికా మీదకు..!
అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి సవాల్ విసిరాడు. ఈసారి ఏకంగా హైపర్‌సోనిక్ వార్‌హెడ్ ఉన్న క్షిపణితోనే ఢీ అంటే ఢీ అన్నాడు. ఈ మేరకు ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. అయితే ఆ మిస్సైల్‌కు.. హైపర్‌సోనిక్ వార్‌హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెళ్లడించింది. ఆ ఆయుధంతో పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను చిత్తు చేయవచ్చు అని నార్త్ కొరియా తెలిపింది.
ఉత్తర కొరియా పరీక్షించిన హైపర్‌సోనిక్ వార్‌హెడ్.. ధ్వని వేగం కన్నా సుమారు 12 రెట్ల వేగంతో వెళ్తుందని తేలింది. దాదాపు 1500 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించింది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా ఉత్తర కొరియా ఇలాగే హైపర్‌సోనిక్ మిస్సైల్స్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. కొత్తగా పరీక్షించిన హైపర్‌సోనిక్ క్షిపణి లో.. కొత్త తరహా ఫ్లయిట్, గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పింది. ఈ పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు. శత్రువులకు తామేంటో చూపించామని వెల్లడించారు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు.
వైరల్ వీడియోలు

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..
Latest Videos