పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.