గాల్లో విమానం.. తనను దించేయాలని మహిళ కేకలు! దుస్తులు విప్పి పరుగులు
విమానం లో ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు ప్రయాణికులంతా భయపడ్డారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఆమె ప్రవర్తనతో అంతా షాకయ్యారు. దాంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హ్యూస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది.
తన దుస్తులు తొలగించి, పెద్దగా అరుస్తూ అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. కాక్‌పిట్ డోర్ వద్దకువెళ్లి, దానిని బాదుతూ తనను దించేయాలని డిమాండ్ చేసింది. సుమారు 25 నిమిషాల పాటు ఆమె వింత ప్రవర్తన కొనసాగిందని ప్రయాణికుడు ఒకరు తెలిపారు. దాంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఒంటిపై దుప్పటికప్పి, ఫ్లైట్ దించేసి హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తాము తీవ్రంగా భయపడినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆమె ప్రవర్తనతో తాము తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యామని భయపడిపోయామని అన్నారు. ఈ ఘటన కారణంగా 90 నిమిషాల ఆలస్యంతో విమానం గమ్యస్థానానికి బయల్దేరింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న
బక్కోడంటూ.. రసికుడంటూ..? స్టార్ క్రికెటర్ గౌరవంతో ఆటలు
పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు
తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

