SSMB29 షూటింగ్ నుంచి వీడియో లీక్.. జక్కన్న సీరియస్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు.
అంతే కాదు ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికర్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు రాజమౌళి.కానీ మహేష్ బాబు ల లుక్ మాత్రం రివీల్ అయ్యింది. ఇప్పటికే మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు షూటింగ్ నుంచి వీడియో లీక్ అయ్యింది. షూటింగ్ సమయంలో సన్నివేశాన్ని ఒకరు ఫోన్ లో షూట్ చేశారు. అదికాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి వీడియో లీక్ అవ్వడంతో జక్కన్న టీమ్ చర్యలకు రెడీ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

