AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality test: ముక్కు ఆకారం చూసి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు..

ఫేస్ రీడింగ్ చేసే చాలా మంది వ్యక్తులు ముక్కు ఆకారాన్ని బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. ఈ కళ దాదాపు మూడు వేల సంవత్సరాల నాటిది. ఎవరి ముఖాన్ని అయినా చూసినప్పుడు.. వారి ముక్కును దగ్గరగా చూస్తే ఆ ముక్కు ఆకారం బట్టి అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు.

Personality test: ముక్కు ఆకారం చూసి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు..
Personality Test
Surya Kala
|

Updated on: Jan 12, 2025 | 8:44 PM

Share

మనం ప్రయాణం చేస్తున్నప్పుడో, మన చుట్టూ, ఆఫీసులో లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడో లక్షలాది మందిని కలుస్తాము. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మనిషి శరీరంలోని ప్రతి భాగం తీరుని బట్టి అతని స్వభావం, వ్యక్తిత్వాన్ని ఊహించవచ్చు. వ్యక్తీ నడవడిక , స్వభావం గురించిన సమాచారం గ్రహాలు , నక్షత్రాల కదలికలను గణన చేసి మాత్రమే కాదు.. పద నిర్మాణం, ముఖ లక్షణాల ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. అయితే ముక్కు ఆకారం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా?

ఫేస్ రీడింగ్ చేసే చాలా మంది వ్యక్తులు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్లు, ముక్కు వంటి అవయాల ఆకారాన్ని బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఈ కళ ఇప్పటిది కాదు సుమారు మూడు వేల సంవత్సరాల నాటిది. కొంతమంది అవతలి వ్యక్తుల ముఖాన్ని చూసినప్పుడు.. అవయవ ఆకారం బట్టి వారి గురించి అంచనా వేస్తారు. అదే విధంగా ఎవరి ముక్కును అయినా దగ్గరగా చూస్తే.. వారి స్వభావం గురించి అంచనా వేస్తారు.

ముక్కు ఆకారం ద్వారా వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి:

  1. ముక్కు నిటారుగా .. పై నుండి క్రిందికి ఏకరీతిగా ఉండే వ్యక్తి..చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. దీనితో పాటు ఇటువంటి ముక్కు ఉన్న వ్యక్తులు ఇతరులను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు.
  2. ముక్కు పొడవుగా , పెద్దదిగా ఉంటే.. ఇతని ధనవంతుడు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాడు. అన్ని ఆనందాలను అనుభవిస్తాడు.
  3. సూటిగా ఉన్న ముక్కు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు, అంతేకాదు ఇతని ఇతరులను మాటలతోనే బాగా ఆకట్టుకుంటాడు.
  4. ముక్కు చిన్నగా.. కొద్దిగా పొడుచుకు వచ్చిన వ్యక్తి స్వచ్ఛమైన మనస్సు గల వ్యక్తి. ఇలాంటి వారు ఎప్పుడూ ఇతరుల మనస్సు గురించి ఆలోచిస్తాడు.
  5. ముక్కు పైభాగంలో ఇరుకైనట్లు.. నాసికా రంధ్రాలు వెడల్పుగా ఉంటే అటువంటి వ్యక్తి అహంకారం, చిరాకు కలిగి ఉంటాడు. అంతేకాదు వీరు చాలా అహంభావులుగా ఉంటారు.
  6. చదునైన , మందపాటి ముక్కు ఉన్న వ్యక్తి జీవితంలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటాడు. ఇతనితో సాధారణంగా ఎవరూ కలిసి ఉండరు.
  7. సన్నని నాసికా రంధ్రాలున్న వ్యక్తులు అసాధారణ అలవాట్లును కలిగి ఉంటారు. బాధ్యతను స్వీకరిస్తారు అలాగే వీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు.
  8. గుండ్రంగా , చక్కగా నాసికా రంధ్రాలు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు, శ్రమించేవాడు.. తెలివైనవాడు.
  9. చిన్న నాసికా రంధ్రాలున్న వ్యక్తి తెలివైనవాడు.. అయితే పిరికివాడు.
ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)