Uric Acid: అదనపు ప్రోటీన్ యూరిక్ యాసిడ్‌ను కూడా పెంచుతుందా? నిపుణుల సలహా ఏమిటంటే

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా యూరిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థం. అయితే కొంతమంది అధిక ప్రోటీన్ కారణంగా యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

Uric Acid: అదనపు ప్రోటీన్ యూరిక్ యాసిడ్‌ను కూడా పెంచుతుందా? నిపుణుల సలహా ఏమిటంటే
Uric Acid
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2025 | 7:46 PM

విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు వంటి పోషకాలు మన శరీరానికి బలాన్ని అందిస్తాయి. శరీరంలో వీటి లోపం వలన అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే పోషకాలు లేకపోవడం మాత్రమే కాదు.. శరీరంలో పోషకాలు ఎక్కువగా ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. శరీరంలో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందని కొందరు అంటున్నారు.

పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ ఈ విషయంపై మాట్లాడుతూ కొన్ని పరిస్థితులలో అదనపు ప్రోటీన్ కారణంగా యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీనికి కారణం పిండి పదార్థాలు, రిఫైన్డ్ షుగర్ అని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారంలో ఈ రెండూ ఎక్కువగా ఉంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

నిపుణుల సలహా ఏమిటంటే

తినే ఆహారంలో ఎక్కువ పిండి పదార్థాలు లేదా చక్కెరను తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మూత్రపిండాలు శరీరం నుంచి యూరిక్ ఆమ్లాన్ని సరిగ్గా తొలగించలేవు. అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఏర్పడటానికి కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ తగ్గించవద్దు

అయితే డాక్టర్ సలహా లేకుండా ప్రొటీన్లను తగ్గించవద్దు. శరీరంలో ప్రొటీన్లు తగ్గడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఎవరైనా సరే యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే డైటీషియన్ నుంచి డైట్ ప్లాన్ తీసుకోవాలి. తదనుగుణంగా తినే ఆహారపు అలవాట్లను కొనసాగించాలి.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

నిజానికి యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థం. జీర్ణక్రియ తర్వాత యూరిక్ యాసిడ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా ప్యూరిన్ ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, మూత్రపిండాలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అటువంటి పరిస్థితిలో యూరిక్ యాసిడ్ శరీరం నుంచి తొలగించబడదు. శరీరంలో దీని పరిమాణం పెరగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య కూడా రావచ్చు.

ఏమి తినాలంటే

నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు విటమిన్ సి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తినే ఆహారంలో నారింజ, పైనాపిల్, నిమ్మ వంటి విటమిన్ సి కలిగి ఉన్నవాటిని చేర్చుకోవాలి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)