AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi: భోగి పండగ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. జీవితంలో సమస్యలు తప్పవు..

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రసిద్ధ పండుగ సంక్రాంతి. ఈ పండుగను జనవరి నెలలో జరుపుకుంటారు. కొత్త పంటల రాకను సూచిస్తుంది. భోగి రోజున ప్రజలు భోగి మంటలు వేస్తారు. భోగి పండగ రోజున మంటలు వేయడం వెనుక సాంప్రదాయంతో పాటు శాస్త్రీయ కోణం కూడా దాగిఉంది. ఈ రోజు దక్షిణాయణం చివరి. రోజు అయితే భోగి మంటలు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు.

Bhogi: భోగి పండగ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. జీవితంలో సమస్యలు తప్పవు..
Bhogi Festival
Surya Kala
|

Updated on: Jan 12, 2025 | 6:47 PM

Share

ప్రతి సంవత్సరం భోగి పండుగను మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 13నభోగి పండుగను, జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు. ఈ ఏడాది భోగి పండగ పుష్య మాసం పౌర్ణమి రోజున వచ్చింది. ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసి.. సాయంత్రం పూజ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 05:34 నుంచి రాత్రి 08:12 వరకు పూజలు చేయడానికి శుభ సమయం. ఈ సమయంలో కుటుంబంతో కలిసి సూర్య భగవానుడు, అగ్ని దేవుడి, దుర్గాదేవి, శ్రీ కృష్ణ భగవానుని పూజించవచ్చు.

భోగి పండగ్ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు

భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వేయవద్దు: అగ్నిని పవిత్రంగా భావిస్తాం. ఇక భోగి రోజున వేసే మంటలను హోమం అంత పవిత్రంగా వేయాలి. కనుక భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్‌ వస్తువులు వేయడం అశుభం.

కిరోసిన్ తో మంటలు వెలిగించ వద్దు: భోగి మంటల సమయంలో కర్పూరం, నెయ్యి వేసి మంటలను వెలిగించాలి. అంతేకాని కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగించవద్దు.

ఇవి కూడా చదవండి

పాదరక్షలు, చెప్పులు ధరించి భోగి మంటలకు ప్రదక్షణ చేయవద్దు: భోగి మంటల చుట్టూ… అంటే అగ్ని చుట్టూ చెప్పులు లేకుండా తిరగాలి. బూట్లు, చెప్పులు ధరించి ప్రదక్షిణ చేయడం ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో వేయవద్దు: అగ్నిలో స్వచ్ఛమైన ప్రసాదాన్ని మాత్రమే వేయాలి. ఎంగిలి చేసిన ఆహారాన్ని బోగి మంటల్లో వేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి.

ఎవరినీ అవమానించవద్దు: భోగి రోజున ఎవరినీ అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఎవరినీ నొప్పించవద్దు: భోగి రోజున ఎవరినీ నొప్పించకూడదు. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుంది.

పిల్లలను మంటల దగ్గర ఒంటరిగా ఉంచవద్దు: భోగి మంటల దగ్గరకు వెళ్ళే పిల్లలను ఎల్లప్పుడూ పెద్దలు పర్యవెక్షిస్తూ ఉండండి. పిల్లలను అగ్ని దగ్గర ఒంటరిగా వదలకూడదు.

భోగి రోజున ఏమి చేయాలంటే..

నువ్వులు, బెల్లం, వేరుశెనగలను అగ్నిలో వేయండి: నువ్వులు, బెల్లం, వేరుశెనగలను భోగి మంటలకు సమర్పించడం వలన ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి.

పేదలకు దానం: భోగి రోజున పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది.

కుటుంబంతో సమయం గడపండి: కుటుంబంతో కలిసి భోగి పండుగను ఆనందంగా జరుపుకోండి.

భోగి ప్రాముఖ్యత

భోగి పండుగ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఈ పండుగ ప్రకృతితో మనిషికి అనుబంధాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భోగి పండుగ ఒకరికొకరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పుతుంది. ఈ పండుగ కొత్త పంటల రాకను సూచిస్తుంది. అగ్నిలో తమ దుర్గుణాలను దహించేలా చేయడం వలన దుష్ట శక్తులు నాశనం అవుతాయని నమ్మకం. భోగి పండుగ ఆనందం సంతోషానికి చిహ్నం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌