Maha Kumbha mela: కుంభ సమయంలోనే నాగ సాధువులు ఎలా వస్తారు? తర్వాత ఎక్కడికి వెళ్తారు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. సోమవారం నుంచి మహాకుంభోత్సవం ప్రారంభం కానుంది. హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయానికి చెందినవారు. నాగ సాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా భావిస్తారు. ఈ నాగ సాధువులు భారీ సంఖ్యలో మహా కుంభలో పాల్గొంటారు. నాగ సాధువుల రహస్య జీవితం కారణంగా వీరు కుంభంలో మాత్రమే కనిపిస్తారు. కుంభమేళాకు ఈ నాగ సాధువులు ఎక్కడ నుంచి వస్తారు? ఎక్కడికి వెళతారు? ఇది ఎవరికీ తెలియదు.

మహాకుంభ జాతర 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రయాగారాజ్ లో ఈ ఏడాది జనవరి 13 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ కుంభ జరిగే సమయంలో నాగ సాధువులు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. ఇక్కడ భారీ సంఖ్యలో నాగ సాధువులు కనిపిస్తారు. అంతేకాదు మహా కుంభమేళా నాగ సాధువుల రాజ స్నానంతో ప్రారంభమవుతుందని చెబుతుంటారు. అయితే జాతర తర్వాత ఈ సాధువులు ఎక్కడా కనిపించరు. అప్పుడు వీరు ఎక్కడ అదృశ్యమవుతారు? లక్షలాది మంది నాగ సాధువులు ఎలాంటి వాహనం ఉపయోగించకుండా.. ప్రజల దృష్టిలో పడకుండా అసలు కుంభానికి ఎలా చేరుకుంటారు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో నాగ సాధువులు హిమాలయాలలో నివసిస్తారని కుంభమేళా సమయంలో మాత్రమే సాధారణ ప్రజలకు కనిపిస్తారని నమ్మకం.
కుంభంలో పాల్గొనే రెండు అతిపెద్ద నాగ అఖారాలు మహా పరినిర్వాన్ అఖారా.. వారణాసిలోని పంచ దష్నం జునా అఖారా. చాలా మంది నాగ సాధువులు కూడా ఇక్కడి నుంచే వస్తారు. నాగ సాధువులు బూడిదను శరీరంపై పూసుకుంటారు. త్రిశూలం, రుద్రాక్ష జపమాలను ధరిస్తారు. కొంత మంది జంతువుల చర్మంతో చేసిన బట్టలు ధరిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే హక్కు వారికి మొదటిది. ఆ తర్వాత మాత్రమే మిగిలిన భక్తుల స్నానానికి అనుమతిస్తారు. ఈ కుంభ ముగిసిన తర్వాత నాగ సాధువులు తిరిగి తమ ప్రపంచానికి వెళ్లి పోతారు.
నాగ సాధువుల జీవితం
కుంభమేళా సమయంలో నాగ సాధువులు తమ అఖారాలను సూచిస్తారు. కుంభం తర్వాత వారు తమ తమ అఖారాలకు తిరిగి చేరుకుంటారు. అఖారాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వీరు అక్కడ ధ్యానం, సాధన, మతపరమైన బోధనలను అందిస్తారు. నాగ సాధువులు సన్యాసి జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కుంభం తర్వాత చాలా మంది నాగ సాధువులు ధ్యానం, తపస్సు కోసం హిమాలయాలు, అడవులు, ఇతర నిశ్శబ్ద, ఏకాంత ప్రదేశాలకు వెళ్లిపోతారు. కఠినమైన తపస్సు, ధ్యానంలో సమయాన్ని గడిపేస్తారు. తమ ఆత్మ, ఆధ్యాత్మిక సాధన అభివృద్ధికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కుంభమేళా లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే నాగ సాధువులు బహిరంగంగా కనిపిస్తారు.
తీర్థయాత్ర ప్రదేశాలలో వసతి
కొంతమంది నాగ సాధువులు కాశీ (వారణాసి), హరిద్వార్, రిషికేశ్, ఉజ్జయిని లేదా ప్రయాగ్‌రాజ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో నివసిస్తున్నారు. ఈ ప్రదేశాలు వారికి మతపరమైన, సామాజిక కార్యకలాపాలకు కేంద్రాలు. నాగ సాధువుగా మారడం లేదా కొత్త నాగ సాధువులకు దీక్ష ఇవ్వడం అనేది ప్రయాగ్, నాసిక్, హరిద్వార్ , ఉజ్జయినిలో కుంభ మేళా జరిగే సమయంలో మాత్రమే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీరిని నాగులు అని పిలుస్తారు. ఉదాహరణకు ప్రయాగలో దీక్ష తీసుకునే నాగ సాధువును రాజరాజేశ్వరుడు అంటారు. ఉజ్జయినిలో దీక్ష చేసేవారిని ఖునీ నాగ సాధు అని, హరిద్వార్‌లో దీక్ష చేసేవారిని బర్ఫానీ నాగ సాధు అని అంటారు. దీనితో పాటు నాసిక్‌లో దీక్ష చేసేవారిని బర్ఫానీ, ఖిచాడియా నాగ సాధువు అని పిలుస్తారు.
ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు
నాగా సాధువులు భారతదేశం అంతటా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. వివిధ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను సందర్శించడం, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తమ ఉనికిని చాటుకుంటారు. చాలా మంది నాగ సాధువులు రహస్యంగా ఉంటూ సాధారణ సమాజానికి దూరంగా తమ జీవితాలను గడుపుతారు. వీరి ఆధ్యాత్మికత, జీవనశైలి వీరిని సమాజం నుంచి వేరుగా, విభిన్నంగా చూపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.