థాయ్‌లాండ్‌లో మరో అయోధ్య.. ఆ దేశాన్ని ఏలే రాజు పేరుకూడా రామ్.. రామాయణాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..

మన దేశంలోనే కాదు రామ్ నగరం మనకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కూడా ఉంది. భారతదేశానికి 3500 కి.మీ దూరంలో ఉన్న 'రామ్ నగరం' చరిత్ర 675 సంవత్సరాల క్రితం నాటిది. 1350 లో ఈ నగరం స్థాపించబడింది. భారతీయ సంస్కృతిచే బాగా ప్రభావితమైంది. ఇక్కడి రాజును ఇప్పటికీ రాముడి పేరుతోనే పిలుస్తారు. ఈ నగరం 675 సంవత్సరాల క్రితం ఎలా నిర్మాణం జరుపుకుందో తెలుసుకుందాం..

థాయ్‌లాండ్‌లో మరో అయోధ్య.. ఆ దేశాన్ని ఏలే రాజు పేరుకూడా రామ్.. రామాయణాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..
Ayodhya Of Thailand
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2025 | 4:44 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం తొలి వార్షికోత్సవం జరుగుతోంది. జనవరి 11 నుంచి ప్రారంభమైన ఈ పండుగ జనవరి 13 వరకు కొనసాగుతుంది. అయితే భారతదేశంలోని అయోధ్యకు వేల కిలోమీటర్ల దూరంలో ఒక అయోధ్య నగరం ఉందని మీకు తెలుసా.. అక్కడ రాజు తన పేరులో రాముడి పేరుని తప్పని సరిగా పెట్టుకుంటాడు. భారతదేశానికి దాదాపు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం పేరు అయుతయ. ఈ నగరం థాయ్‌లాండ్‌లో ఉంది.

భారతదేశంలో శ్రీరాముడిని దేవుడిగా భావిస్తారు. అదే సమయంలో థాయ్‌లాండ్‌లోని చక్రి వంశపు రాజులు తమ పేర్లతో ‘రామ్’ అని చేర్చుకుంటారు. అయితే ఈ సంప్రదాయం యూరోపియన్ సంస్కృతిచే ప్రభావితమైందని నమ్ముతారు. ఎందుకంటే ఈ వంశానికి చెందిన ఆరవ రాజు వజీరావుడు ఇంగ్లాండులో చదువుకున్నాడు. అక్కడ బ్రిటన్ పాలకులు తమ పేర్లకు సంఖ్యలను జోడించడం చూశాడు.

పేరులో రామ్ ..

ప్రస్తుతం థాయ్‌లాండ్ రాజు బిరుదు రామదాసం. రామ్ దశమ్‌ను ‘ఫుట్‌బాల్ ప్రిన్స్’ అని కూడా పిలుస్తారు. సైక్లింగ్ సంబంధిత ఈవెంట్‌ల్లో కూడా ప్రసిద్ధి చెందారు. రామ్ తొమ్మిదవ (భూమిబోల్ అదుల్యదేజ్) మరణం తర్వాత వజిరాలాంగ్‌కార్న్ పట్టాభిషేకం అంటే రామ్ పదవ రాజుగా పట్టాభిషేకం 2019లో జరిగింది. 2020 లో ఇతని సంపద 43 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది, దీని కారణంగా అతను ప్రపంచంలోనే అత్యంత ధనిక పాలకుడిగా గుర్తించబడ్డాడు.

ఇవి కూడా చదవండి

అయోధ్య .. అయుతయ పేరు

పేరులో ఈ సారూప్యతకు కారణం సంస్కృత పదాలను థాయ్ భాషలోకి అనువదించడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం రామాయణం ప్రభావం థాయ్‌లాండ్‌లో కూడా ఉంది. రామాయణంను అక్కడ ప్రజలు ‘రామకియన్’ అని పిలుస్తారు. అందుకే ఇక్కడి పాలకులు శుభప్రదంగా భావించి తమ నగరాన్ని అయుత అని పేరు పెట్టారు.

అయుతయ చారిత్రక ప్రాముఖ్యత

థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరం 1350లో స్థాపించబడింది. ఒకప్పుడు విశాలమైన సామ్రాజ్యానికి రాజధాని. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయుతయ నగరంలో ఇప్పటికీ భారీ శిధిలాలు కనిపిస్తాయి. అయుతయ పేరు మాత్రమే కాదు పోలికలో కూడా భారతదేశంలోని అయోధ్య లాగా ఉంటుంది. ఇది మూడు నదులతో చుట్టుముట్టబడి ఉంది. అయితే భారతదేశంలోని అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉంది. బ్రహ్మ, విష్ణు, శివ ఆలయాలు కూడా అయుతయలో ఉన్నాయి.

అయుతయ నగరం ఒక ముఖ్యమైన దౌత్య, వాణిజ్య కేంద్రం. 1767లో బర్మా (ప్రస్తుతం మయన్మార్) అయుతయాపై దాడి చేసి దానిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత థాయిలాండ్ పాలకులు పునరావాసం కోసం ప్రయత్నించలేదు. బ్యాంకాక్‌ను కొత్త రాజధానిగా మార్చి పాలన కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..