ఏడాది కాలంలోనే చరిత్ర సృష్టించిన రామ మందిరం.. ఇప్పటి వరకూ వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా?

రామ జన్మ భూమి అయోధ్యలోని రామయలయం గర్భ గుడిలో బాల రామయ్య కొలువుదీరి ఒక సంవత్సరం గడిచింది. రామాలయ మొదటి వార్షికోత్సవం ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనునంరు. ఇక్కడ జరిగే ప్రతిష్టా ద్వాదశి వేడుకలు జనవరి 11 నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ ఉత్సవాలు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రామాలయానికి ఇప్పటి వరకు ఎంత విరాళం అందింది.. ఎవరు ఎక్కువగా ఇచ్చారో తెలుసుకుందాం.

ఏడాది కాలంలోనే చరిత్ర సృష్టించిన రామ మందిరం.. ఇప్పటి వరకూ వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా?
Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2025 | 3:55 PM

అయోధ్యలో రామాలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు జనవరి 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ప్రతిష్ట ద్వాదశిగా జరుపుతున్నారు. బాల రామయ్యకు హారతి, ప్రత్యేక పూజలతో మహా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రతిష్ట ద్వాదశి వేడుక మూడు రోజుల పాటు అంటే జనవరి 13 వరకు కొనసాగుతుంది. ప్రతిష్టా ద్వాదశి ఉత్సవాల మూడు రోజులూ విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రాంలాలా గర్భ గుడిలో కొలువుదీరి ఒక సంవత్సరం గడిచింది. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాదిలో రామమందిరానికి ఎంత విరాళం ఇచ్చారు? ఎవరు ఎక్కువగా విరాళాలు ఇచ్చారో తెలుసుకుందాం.

రామాలయానికి ఇప్పటివరకు ఎంత విరాళం వచ్చింది?

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అందిన కానుకల గురించి సమాచారం ఇచ్చింది. కాగా ఆలయంలోని హుండీల ద్వారా రూ.55.12 కోట్ల విలువైన విరాళాలు వచ్చాయని ప్రకటించింది. రామాలయానికి ఇప్పటివరకు రూ.5000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని ఆలయ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది.

అంకిత నిధిని అందించిన 18 కోట్ల మంది రామభక్తులు

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఇప్పటివరకు రామాలయ అంకిత నిధి ఖాతాలో రూ. 3200 కోట్లు వచ్చాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు రామ మందిర నిర్మాణానికి వివిధ బ్యాంకుల నుంచి రూ. 3,200 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు విదేశాల నుంచి ఎంత విరాళం అందిందంటే

ఇప్పటివరకు రామ ఆలయానికి విదేశాల నుంచి రూ.11 కోట్ల విరాళాలు అందాయి. అక్టోబర్ 2023లో విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు రామాలయానికి అనుమతి లభించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఆలయానికి నేపాల్, అమెరికా నుంచి అత్యధిక విరాళాలు అందాయి.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితా

  1. కథకుడు మొరారి బాపు రూ.11.3 కోట్లు విరాళంగా ఇచ్చారు
  2. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో నివసిస్తున్న మొరారీ బాపు వ్యక్తిగత అనుచరులు ఏకంగా రూ. 8 కోట్లు విరాళంగా ఇచ్చారు.
  3. వజ్రాల కంపెనీ శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమాని గోవింద్‌భాయ్ ధోలాకియా రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..