వర్కింగ్ ఉమెన్స్ కి టైమ్ సేవింగ్స్ చిట్కాలు
చలికాలంలో మహిళలకు ఉదయపు వంట పనులు వేగంగా ముగించడానికి కొన్ని చిట్కాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ముందుగా మెనూ ప్లాన్ చేస్తే సమయం ఆదా అవుతుంది. వెల్లుల్లి, ఉల్లిపొట్టులను వేడి నీటితో సులభంగా తీసుకోవచ్చు. గుడ్లను సులభంగా పొట్టు తొలగించాలంటే, ఉడికించే నీటిలో బేకింగ్ సోడా వేయాలి. ఆకుకూరలను ముందురోజే కట్ చేసి నిల్వ చేస్తే సమయం ఆదా అవుతుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలాలను ముందుగానే తయారుచేసుకోవడం వంట సమయాన్ని తగ్గిస్తుంది. ఈ చిట్కాలు పాటించడం వలన సమయాన్ని బాగా ఆదా చేసుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో మనలో ఎక్కువ మంది మహిళలు జాబ్స్ చేస్తుంటారు. వీరు ఇంటి పనులను కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. దీని వల్ల వంట పనులు, ఇంటి పనులు అన్ని లేట్ అవుతుంటాయి. హడావిడిగా వర్క్ స్టార్ట్ చేయాల్సి వస్తోంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మనం అన్ని పనులు ఫటా ఫట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
అడ్వాన్స్ మెనూ ప్లాన్
రోజు ఉదయాన్నే ఏ వంట చేయాలో ఆలోచించడంలో చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. తెలియంది ఏముంది.. ఒక్క దగ్గర ఆలస్యం అయితే అన్ని సమయాలోనూ మార్పులు ఉంటాయి. అందుకే రేపు ఏ వంట చేయాలో ముందురోజే డిసైడ్ అయితే అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఉదయం తక్కువ టైమ్ లో పని పూర్తవుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపొట్టు తొలగింపుకు ఈజీ టిప్
వెల్లుల్లి, ఉల్లిపొట్టులు తీసేందుకు కాస్త ఓపిక అవసరం. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ పనిని వేగవంతం చేయాలంటే, ఇవి వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టి, ఆపై పొట్టు తీసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఇది వంట సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఎగ్స్ ఉడికించేందుకు చిన్న చిట్కా
ఉదయాన్నే గుడ్లు ఉడికించి దాని పొట్టు తీసేందుకు కొంత సమయం పడుతుంది. పొట్టు సులభంగా రావాలంటే గుడ్లను ఉడికించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదా వెనిగర్ వేసి ఉడికించాలి. ఈ పద్ధతిని పాటిస్తే, గుడ్ల పొట్టు తొలగించడం చాలా ఈజీ అవుతుంది.
తక్కువ టైమ్ లో ఆకుకూరలు
ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. అయితే ఉదయాన్నే వాటిని కట్ చేయడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఆకుకూరలను ముందురోజే కట్ చేసి, వంటలో ఉపయోగించుకునేలా ఫ్రిజ్‌లో ఏయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచితే, ఉదయం సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇలా చేయడంతో వంట కూడా త్వరగా పూర్తవుతుంది.
పాలు పొంగకుండా కాచడం
పాలు కాచేటప్పుడు పొంగే సమస్యను నివారించాలంటే పాల గిన్నె మీద చెక్క గరిటె ఉంచాలి. ఇలా చేస్తే పాలు పొంగకుండా కాచి మీ సమయాన్ని దాచుకోవచ్చు. పైగా స్టవ్ కూడా నీట్ గా ఉంటుంది.
ముందుగానే పేస్ట్‌లు, పొడులు సిద్ధం చేయండి
అల్లం-వెల్లుల్లి పేస్ట్, పల్లీ పొడి, గరం మసాలా వంటి పదార్థాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ముందుగానే పెద్ద మొత్తంలో తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే వంట పని వేగవంతమవుతుంది. మరొకటి, బంగాళాదుంపల తొక్క తొలగించడం సులభంగా చేయాలంటే, వాటిని ఉడికించే ముందు ఫోర్క్‌తో గాట్లు పెట్టి ఉడికిస్తే తొక్క ఈజీగా వస్తుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా చలికాలంలో కూడా వంట పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు.