అందాల ముద్దుగుమ్మ రాషా థడానీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ, ఈ బ్యూటీ రామ్ చరణ్ ఆర్సీ16 సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అరగేట్రం చేయనున్నట్లు సమాచారం.
కాగా, తాజాగా రాషా థడానీ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నటి తన అందంతో అందరినీ మాయ చేస్తుంది.
తన ఫ్యాషన్ లుక్స్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. చేతిలో చిన్న బ్యాగ్, తెల్లటి స్ట్రాపీ హీల్స్, బ్లాక్ కలర్ స్లీక్ బ్రౌన్ లెదర్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపిస్తుంది.
అలాగే పసుపు రంగు కుర్తాలో పెదవులపై చిరునవ్వుతో ఉన్న ఫోటోస్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక రాషా థడానీ ఆజాద్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది.
ఈ మూవీ జనవరి 17న దేశ విదేశాల్లోని అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఉయ్యి అమ్మ పాటలో రాషా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ఇక 19 ఏళ్లలోనే రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ బాలీవుడ్‌లోకి నటిగా అరగేట్రం చేయడంతో, ఇప్పుడు అందరి ఫోకస్ ఈ బ్యూటీ పైనే ఉంది. మరి తన మొదటి సినిమాలో రాషా తన నటనతో మెప్పిస్తుందో లేదో చూడాలి మరి