12 January 2025
Pic credit-Pexel
TV9 Telugu
భారతీయ వంటగదిలో ఉపయోగించే ప్రతి మసాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇవి రుచిని పెంచే మసాలాలు మాత్రమే కాదు..ఈ మసాలాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
భారతీయ ఇళ్లలో వాము తప్పని సరిగా ఉంటుంది. దీనిని ఇంటి నివారణలకు కూడా ఉపయోగిస్తారు. శీతాకాలానికి ఇది అద్భుతమైన మెడిసిన్
వాములో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని స్వభావం వేడి.. కనుక చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఈ సీజన్ లో వాము వాటర్ రోజూ తాగితే ఎలాంటి ప్రయోజనం అంటే
చలికాలంలో బరువు పెరుగుతున్నామని భావిస్తే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడమే కాదు ప్రతిరోజూ ఉదయం వాము వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది .
శీతాకాలంలో యూరిక్ యాసిడ్ పెరిగి.. తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడతారు. ప్రతిరోజూ ఉదయం వాము నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
ఉదయాన్నే గోరువెచ్చని వాము నీరు తాగడం వల్ల దగ్గు , జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది.
ఉదయాన్నే వాము నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. అయితే డయేరియా ఉన్నవారు వాము నీటిని తాగవద్దు.