- Telugu News Photo Gallery Follow these tips for Oil Freezing in winter Season, Check Here is Details
Kitchen Hacks: చలి కాలంలో ఆయిల్స్ గడ్డ కడుతున్నాయా.. ఇలా చేయండి..
సాధారణంగా శీతా కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఆయిల్ గడ్డ కట్టడం కూడా ఒకటి. ఆయిల్ గడ్డ కట్టడం కారణంగా వంటలో ఉపయోగించాలన్నా, తలకు రాసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పిన చిట్కాలు ట్రై చేస్తే ఆయిల్ గడ్డకట్టకుండా ఉంటుంది..
Updated on: Jan 12, 2025 | 9:55 PM

శీతా కాలం వచ్చిందంటే ఆయిల్స్ అనేవి గడ్డ కడుతూ ఉంటాయి. ఇది అందరి ఇళ్లలో ఉండే సాధారణ సమస్యలో ఇది కూడా ఒకటి. కొబ్బరి నూనె మొదలు.. వంటకు ఉపయోగించే మంచూ నూనె కూడా గడ్డ కడుతూ ఉంటుంది. వాతావరణంలో పరిస్థితుల కారనంగా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి.

ఈ నూనెను వేడి చేయడానికి మహిళలు నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఎక్కువగా ప్రతి రోజూ వేడి చేస్తూ ఉంటే.. ఆయిల్‌లో అనేక మార్పులు జరుగుతాయి. ఎక్కువ సార్లు వేడి చేసిన ఆయిల్ వంటకు, శరీరానికి ఉపయోగించకూడదు.

ఇలా గడ్డ కట్టిన ఆయిల్‌ని ఎండలో పెట్టి వేడి చేయడం చాలా మంచిది. దీని వల్ల ఆయిల్ పాడవకుండా ఉంటుంది. నూనెలు గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, ఉసిరి నూనె, నువ్వుల నూనె వంటివి కలిపితే మంచి ఫలితం ఉంటుంది.

ఈ ఆయిల్స్ కూడా ఆరోగ్యవంతమైనవే కాబట్టి.. వంటకు ఉపయోగించినా మంచిదే. ఇష్టం లేని వాళ్లు వదిలేయవచ్చు. కొబ్బరి నూనెలో కలిపి రాయడం వల్ల జుట్టుకు చాలా మంచిది. మంచి పోషకాలు జుట్టుకు అందుతాయి.

నూనెలు త్వరగా గడ్డకట్టకుండా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా స్టీల్, గాజు సీసాల్లో స్టోర్ చేస్తే మంచిది. ఇలా స్టోర్ చేయడం వల్ల నూనె అనేది త్వరగా గడ్డకట్టకుండా ఉంటుంది. నూనెలను వేడి నీటిలో పెట్టి కూడా కరిగించవచ్చు.




