మీ పళ్లు పచ్చగా మారాయా.. టెన్షన్ వద్దు ఇలా తెల్లగా చేసేయండి!

12 January 2025

samatha

TV9 Telugu

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక బ్యూటిఫుల్‌గా కనిపిచడానికి ఫేస్ బాగుంటే సరిపోతుందా? లేదండోయ్.. మన మొహం లో చిన్న చిరునవ్వు మనకు ఎంతో అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దీంతో మనలో కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోతుంది.

TV9 Telugu

అయితే మనం నవ్వినప్పుడు మన పళ్లు తెల్లగా మెరిస్తే, మన అందానికే మెరుగులు దిద్దినట్లు ఉంటుంది. అలా కాదని పచ్చగా ఉంటే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి.

TV9 Telugu

పసుపు రంగులో ఉన్న పళ్లను చూడటానికి ఎవరూ ఇష్టపడరు, అంతే కాకుండా వారితో మాట్లాడటానికి కూడా పక్కన ఉన్నవారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వారిపై నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది.

TV9 Telugu

అందుకే పళ్లు ఎప్పుడూ, తెల్లగా మెరిసే విధంగా ఉంచుకోవాలి. అయితే పచ్చగా మారిన పళ్లను ఎలా తెల్లగా చేసుకోవాలా అని కొందరు అతిగా ఆలోచిస్తుంటారు. కాగా, వారికోసమే ఈ టిప్స్.

TV9 Telugu

పళ్లు పసుపు పచ్చ రంగులో ఉన్న వారు ఉప్పు, నిమ్మరసం కలిపి వారానికి రెండు సార్లు పళ్లను తోముకోవడం వలన పళ్లపై ఉండే పసుపు రంగు తొలిగిపోతుందంట.

TV9 Telugu

బేకింగ్ సోడా తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే పసుపు రంగు పళ్లతో బాధపడుతున్నవారు, బేకింసోడాను మీ టూత్ పేస్ట్‌లో కొంచెం కలిపి బ్రష్ చేసుకోవడం వలన పళ్లు తెల్లగా అవుతాయంట.

TV9 Telugu

అలాగే ఇంట్లో ఉన్న నువ్వుల నూనె కొబ్బరి నూనెను కొద్దిగా నోట్లో వేసుకొని పుక్కలించాలంట, దాదాపు 20 నిమిషాల వరకు ఇలా చేయడం వలన పళ్లపై ఉండే పసుపు మరకలు పోతాయి.

TV9 Telugu

నారింజ లేదా నిమ్మకాయ తొక్కలు కూడా పళ్లపై ఉన్న మరకలను తొలగించడం లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నారింజ తొక్కను పళ్లపై రుద్దడం వలన పళ్లు తెల్లగా మెరుస్తాయి.