Masala Egg Paratha: మసాలా ఎగ్ పరాటా.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు..
గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. వీటితో ఏం చేసినా టేస్టీగానే ఉంటాయి. చాలా మందికి కోడిగుడ్డుతో చేసే ఎగ్ పరాటాలు అంటే ఇష్టం. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే పరాటాల కంటే మసాలా ఎగ్ పరాటాలను ఇలా చేయండి.. ఇక ఒకదాని తర్వాత మరొకటి లాగిస్తూ ఉంటారు..
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉడకబెట్టిన ఒక గుడ్డు తింటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. శరీరం బలంగా, దృఢంగా ఉంటుంది. ఇక గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. వీటితో ఏం చేసినా టేస్టీగానే ఉంటాయి. చాలా మందికి కోడిగుడ్డుతో చేసే ఎగ్ పరాటాలు అంటే ఇష్టం. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే పరాటాల కంటే మసాలా ఎగ్ పరాటాలను ఇలా చేయండి.. ఇక ఒకదాని తర్వాత మరొకటి లాగిస్తూ ఉంటారు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ఈ మసాలా ఎగ్ పరాటాలను ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
మసాలా ఎగ్ పరాటాలకు కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన కోడి గుడ్లు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం, ధనియా పొడి, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, గోధుమ పిండి, నూనె లేదా నెయ్యి.
మసాలా ఎగ్ పరాటాలు తయారీ విధానం:
ముందుగా ఉడికించిన గుడ్లను సన్నగా కట్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసి అన్నీ మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టండి. మరో లోతైన గిన్నె తీసుకుని.. అందులో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నెయ్యి, నీళ్లు వేసి మెత్తగా ఉండేలా చపాతీ పిండిని కలుపుకోండి.
ఈ పిండిని ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసి ఒక్కో దాన్ని ముందు చిన్న ముద్దగా చేసి.. మధ్యలో ఈ ఎగ్ మిశ్రమాన్ని ఉంచండి. ఆలూ పరాటా ఎలా తయారు చేస్తారు.. అదే విధంగా ఈ పరాటాను కూడా అన్నీ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ లేదా ఆయిల్‌తో పరాటాలను కాల్చుకుని వేడి వేడిగా తింటే.. ఆహా చాలా రుచిగా ఉంటుంది. నేరుగా ఉత్తివి తిన్నా చాలా రుచిగా ఉంటాయి. లేదంటే నాన్ వెజ్ కర్రీ అయినా పన్నీర్ కర్రీతో తిన్నా బాగుంటాయి.