- Telugu News Photo Gallery How to make Tasty and Healthy Mutton Biryani, Check Here is Details in Telugu
Mutton Biryani: పండగ స్పెషల్.. నోరూరించే మటన్ బిర్యానీ.. సింపుల్‌గా కుక్కర్‌లో చేసేయండిలా..
చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ ఉండే టేస్టే వేరు. మటన్ అంటే ఇష్టం ఉన్న వారికి దాని టేస్ట్ తెలుస్తుంది. రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. కానీ సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కుక్కర్‌లో ఈజీగా అయిపోతుంది..
Chinni Enni | Edited By: Shaik Madar Saheb
Updated on: Jan 12, 2025 | 10:30 PM

చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ ఉండే టేస్టే వేరు. మటన్ అంటే ఇష్టం ఉన్న వారికి దాని టేస్ట్ తెలుస్తుంది. రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. కానీ సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కుక్కర్‌లో ఈజీగా అయిపోతుంది.

మటన్ బిర్యానీకి.. ఆయిల్, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, పుదీనా, బాస్మతీ రైస్, ఫ్రైయిడ్ ఆనియన్స్, పెరుగు, నిమ్మరసం కావాలి. ముందుగా బాస్మతీ రైస్‌ని ఓ అరగంట పాటు ముందు నానబెట్టాలి.

ఆ తర్వాత కుక్కర్ తీసుకుని ఆయిల్, నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేయాలి. నెక్ట్స్ పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మటన్ వేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం ఫ్రై చేసిన తర్వాత కారం, ఉప్పు, మసాలా, పసుపు, పెరుగు అన్నీ వేసి కలుపుకోవాలి.

వీటిని కూడా వేయించాక.. నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టాలి. ఓ పది విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్ తీశాక ముక్కలను తీసేయాలి. నీళ్లు ఎన్ని ఉన్నాయో కొలత వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతీ రైస్‌కి ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి. కుక్కర్‌లో ఉన్న నీళ్లను బట్టి నీళ్లు వేసుకోవాలి.

ఆ తర్వాత ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఫ్రెయిడ్ ఆనియన్స్ వేసి మళ్లీ అంతా ఒకసారి కలిపి విజిల్ పెట్టండి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి.. వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టండి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ సిద్ధం.





























