అండర్-19 టోర్నీలో వరల్డ్ రికార్డు.. 14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఇరా జాదవ్
వన్డే మ్యాచుల్లో డబుల్ సెంచరీ చేస్తేనే పెద్ద ఘనతగా భావిస్తాం. కానీ అండర్ -19 క్రికెటర్ ట్రిపుల్ సెంచరీ కొట్టి, అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా 14 ఏళ్ల వయసులోనే బిగ్ షాట్స్ బాదింది. 157 బంతుల్లోనే 346 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఫీట్ సాధించాడు. ముంబైకి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అడుగుపెట్టిన ఇరా జాదవ్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.
ముంబయి బ్యాట్స్ ఉమన్ ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత అండర్-19 మహిళల వన్డే టోర్నీలో 14 ఏళ్ల ఇరా జాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరులో ముంబయి-మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరా జాదవ్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్ మొత్తం కలిపి కొట్టే స్కోరును ఒంటిచేత్తో కొట్టేసింది.
మహిళా క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ముంబై తరఫున బరిలోకి దిగిన ఇరా జాదవ్.. మేఘాలయపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. బంతిని కసితీరా చితకబాదింది. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించింది. 157 బంతుల్లోనే ఏకంగా 346 పరుగులు చేసింది. ఇందులో 42 బౌండరీలతో పాటు 16 భారీ సిక్సులు ఉన్నాయి. తనతో తానే పోటీపడి బిగ్ షాట్స్ బాదింది ఇరా. రీసెంట్‌గా జరిగిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్‌లో ఆమెను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆ కోపంతోనో ఏమో మేఘాలయపై విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది ఇరా జాదవ్.
ఇన్నింగ్స్ చివరి వరకు నాటౌట్‌గా నిలబడింది ఇరా జాదవ్. ఆమెతో పాటు కెప్టెన్ హుర్లే గాలా కూడా రాణించడంతో ముంబై ఓవర్లన్నీ ఆడి మూడు వికెట్ల నష్టానికి 563 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ కేవలం 19 పరుగులకే కుప్పకూలింది. కనీసం ఫైట్ కూడా చేయకుండానే చేతులెత్తేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 544 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది ముంబై జట్టు. కాగా, ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఇరా జాదవ్ అరుదైన ఘనత సాధించింది. భారత విమెన్స్ క్రికెట్ హిస్టరీలో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..