IPL 2025: ఇక సమరమే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ఐపీఎల్ ప్రారంభం అప్పటినుంచే..

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ షురూపై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.. ఆదివారం బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ముంబయిలో జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. ఐపీఎల్‌ ప్రారంభంపై స్పందించారు.

IPL 2025: ఇక సమరమే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ఐపీఎల్ ప్రారంభం అప్పటినుంచే..
Indian Premier League 2025
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2025 | 6:52 PM

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ షురూపై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.. ఐపీఎల్ (IPL) 2025 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25న ఫైనల్‌ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఆదివారం బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ముంబయిలో జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. ఐపీఎల్‌ ప్రారంభంపై స్పందించారు. మార్చి 23వ తేదీ నుంచి IPL ప్రారంభం అవుతుందని.. ఫైనల్ మ్యాచ్ మే 25 న ఉంటుందని వెల్లడించారు. అయితే.. పూర్తి స్థాయి షెడ్యూల్ వివరాలను త్వరలోనే బీసీసీఐ విడుదల చేయనుంది.

తాజా ప్రకటన ప్రకారం.. మార్చి 9న జరగనున్న 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సరిగ్గా రెండు వారాల తర్వాత IPL 18వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. నవంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన IPL 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ (PBKS) రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. 17వ గత సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) IPL ఛాంపియన్‌గా నిలిచింది.

కాగా.. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఖరారు చేసే సమావేశం జనవరి 18 లేదా 19 తేదీల్లో జరుగుతుందని శుక్లా చెప్పారు. అన్ని జట్లూ తమ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లను ప్రకటించేందుకు జనవరి 12వ తేదీని ఐసిసి గడువు విధించగా, భారత జట్టును ప్రకటించడంలో జాప్యం జరుగింది.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఇప్పటికే తమ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులను ప్రకటించాయి. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌తో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆటను ప్రారంభించనుంది. మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడే ముందు ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడుతుంది. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

జై షా స్థానంలో దేవజిత్‌ సైకియా..

బీసీసీఐ సమావేశంలో బీసీసీఐ నూతన సెక్రటరీ , ట్రెజరర్‌ ఎన్నిక జరిగింది.. బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఐసీసీ ఛైర్మన్‌గా జైషా వెళ్లిన సంగతి తెలిసిందే.. దీంతో జైషా స్థానంలో కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఎంపికైనట్లు బీసీసీఐ ఎస్‌జీఎం ఆదివారం వెల్లడించింది.

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి