AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snow Rain: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. ధవళ వర్ణ కాంతులతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న సౌదర్యం..

కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ మంచు దుప్పటి కప్పుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. గుల్మార్గ్ ప్రకృతి సౌదర్యం, అద్భుతమైన అందంతో పాటు శీతాకాలపు క్రీడలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం అలాగే స్కీయింగ్ డెస్టినేషన్. శీతాకాలంలో మంచుతో కప్పబడిన గుల్‌మార్గ్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

Surya Kala
|

Updated on: Dec 19, 2023 | 9:24 AM

Share
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గుల్‌మార్గ్‌లో మంచు కురుస్తున్న కారణంగా ధవళ వర్ణ సౌందర్యంతో కనువిందు చేస్తుంది. X (ట్విటర్‌లో) గుల్‌మార్గ్ ఫోటోలు, వీడియోలు వైరల్  అవుతున్నాయి. ఆదివారం ఇక్కడ మంచు కురుస్తుండటంతో వారాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. 

1 / 12
భారీగా మంచు కురుస్తుండటంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పర్యాటకులు కొంత ఇబ్బంది పడ్డారు.

2 / 12
జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన గుల్‌మార్గ్ హిమపాతం, లూపిన్ పువ్వుల సీజన్‌లో ఆకర్షణీయమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. గుల్మార్గ్ శీతాకాలపు క్రీడలకు కూడా ప్రసిద్ధి చెందింది. స్కీయింగ్ డెస్టినేషన్ గా ఖ్యాతిగాంచింది. 

3 / 12
అందమైన దృశ్యంతో కూడిన ఈ ప్రదేశం సెయింట్ మేరీస్ చర్చి, మహారాజా ప్యాలెస్, మహారాణి ఆలయం, గుల్మార్గ్ గొండోలా మొదలైన వాటికి ప్రసిద్ధి చెందింది.

4 / 12
భారత వాతావరణ శాఖ శ్రీనగర్ ప్రకారం, ఆదివారం ఉదయం 8:30 గంటలకు, గుల్మార్గ్ -5.8 డిగ్రీల సెల్సియస్, పహల్గామ్ 0.2 డిగ్రీల సెల్సియస్, బనిహాల్ 0.6 డిగ్రీల సెల్సియస్ మరియు జమ్మూలో 8.8 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. శ్రీనగర్‌లో ఆదివారం 1.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

5 / 12
ఈ శీతాకాలపు మొదటి హిమపాతం భూమిని అలంకరించడంతో గుల్మార్గ్ సహజ సౌందర్యం మరింత మెరుగుపడింది. 

6 / 12
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్‌లలో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

7 / 12
 బారాముల్లా జిల్లాలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ అయిన గుల్‌మార్గ్‌లో కనిష్టంగా మైనస్ 2.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

8 / 12
ఖాజీగుండ్‌లో మైనస్ 3.8 డిగ్రీల సెల్సియస్, కోకర్నాగ్ పట్టణంలో మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో మైనస్ 1.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

9 / 12
ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన రోడ్లపై ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వీడియోలు, ఫోటోలు కనుల విందు చేస్తున్నాయి.  ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్‌లో 6 అంగుళాల మేర మంచు కురిసింది.

10 / 12
గుల్‌మార్గ్, కర్నా, మచిల్, గురెజ్, కుప్వారాలోని దాదాపు అన్ని ఎగువ ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో  తాజా హిమపాతం సంభవించింది. ఎగువ కాశ్మీర్‌లో ఇటీవల మంచు కురుస్తుండగా మైదాన ప్రాంతాల్లో శనివారం వర్షం కురిసింది.

11 / 12
గుల్‌మార్గ్ స్కీ రిసార్ట్‌తో సహా కాశ్మీర్ పర్వతాల్లో తేలికపాటి మంచు కురుస్తున్నందున శనివారం మొఘల్ రోడ్ ట్రాఫిక్ కోసం మూసివేశారు. 

12 / 12