పసుపు, ఆకుపచ్చ.. ఇందులో ఏ నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇది రెండు రకాలు, అందులో పసుపు నిమ్మకాయ ఒకటి, పచ్చరంగు నిమ్మకాయ ఒకటి. అయితే ఈ రెండిలో ఏ నిమ్మకాయ వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీనిలో ఏది తినడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Oct 27, 2025 | 6:38 PM

నిమ్మకాయలు రెండు రకాలు, అందులో పసుపు నిమ్మకాయ ఒకటి, పచ్చరంగు నిమ్మకాయ ఒకటి. అయితే ఈ రెండిలో ఏ నిమ్మకాయ వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీనిలో ఏది తినడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిమ్మకాయలు రెండు కూడా రంగు మాత్రమే వేరు కానీ , వాటి పరిణామం, సువాసన, రుచి అన్నీ ఒకే విధంగా ఉన్నట్టు అనిపించినా, వీటిలో చాలా తేడాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అవి ఏమిటంటే?

పచ్చ రంగులో ఉండే నిమ్మకాయ రుచికి పుల్లగా, కాస్త ఛేదుగా అనిపిస్తుంది. అదే పసుపు రంగు నిమ్మకాయ కొంచెం తీపి స్వభావం కలిగి, పుల్లగా ఉంటుంది. ఇక పసుపు నిమ్మకాయలో ఆకుపచ్చ నిమ్మకాయ కంటే ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఉంటుందంట.

అయితే ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా విటమిన్ సి అత్యధికంగా పసుపు నిమ్మకాయలో ఉంటుంది. అందువలన పసుపు నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇక ఆకు పచ్చ నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ అని చెప్పాలి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, జీర్ణసమస్యలను తగ్గించడమే కాకుండా, శరీరంలోని వాపును కూడా తగ్గిస్తాయి.



