- Telugu News Photo Gallery These precautions are mandatory if there is blood in stool, Check here is details
Blood in Stool: మలంలో రక్తం పడుతుందా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
కొంత మందిలో మల విసర్జన చేసే సమయంలో రక్తం పడుతూ ఉంటుంది. కానీ ఇది పెద్దగా ఎవరూ కేర్ చేయరు. వేడి చేయడం వలన ఇలా అవుతుందని అనుకుంటారు. కానీ మలంలో రక్తం రావడం అనేది అతి చిన్న సమస్య కాదు. ఇది ఫైల్స్ సమస్య నుంచి పెద్ద ప్రేగు క్యాన్సర్ వరకు ముడిపడి ఉంటుంది. ఒకటి, రెండు సార్ల కంటే తరచూ మీకు మలంలో రక్తం పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు..
Updated on: Oct 07, 2024 | 10:10 PM

కొంత మందిలో మల విసర్జన చేసే సమయంలో రక్తం పడుతూ ఉంటుంది. కానీ ఇది పెద్దగా ఎవరూ కేర్ చేయరు. వేడి చేయడం వలన ఇలా అవుతుందని అనుకుంటారు. కానీ మలంలో రక్తం రావడం అనేది అతి చిన్న సమస్య కాదు. ఇది ఫైల్స్ సమస్య నుంచి పెద్ద ప్రేగు క్యాన్సర్ వరకు ముడిపడి ఉంటుంది.

ఒకటి, రెండు సార్ల కంటే తరచూ మీకు మలంలో రక్తం పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేసుకోవాలి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే చికిత్స ఖచ్చితంగా తీసుకోవాలి.

మొదటి సారి మలంలో రక్తం కనిపించినప్పుడే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య పెద్దదిగా మారకుండా ఉంటుంది. మల విసర్జనలో మలం రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నీటిని వీలైనంత వరకు ఎక్కువగా తాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు క్లీన్ అవుతాయి. మలినాలు, విష పదార్థాలు ఏమైనా ఉంటే బయటకు పోతయాి.

మీకు మలంలో రక్తం కనిపించినా.. నొప్పిగా ఉన్నా వెంటనే ఆ మలద్వారం చుట్టూ కొబ్బరి నూనె లేదా కలబంద గుజ్జు రాయండి. అదే విధంగా ఐస్ ముక్కలను ఓ క్లాత్‌లో చుట్టి.. మల ద్వారం చుట్టూ కాపడం పెట్టినా ఫలితం ఉంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




