- Telugu News Photo Gallery Cinema photos Heroines like samantha, Deepika Padukone, Alia Bhatt are getting chances after their marriage
పెళ్ళైన తగ్గని హీరోయిన్స్ దూకుడు.. తట్టుకోలేకపోతున్న కుర్ర భామలు
పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవి కావు.. వచ్చినా అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్‌గానే కొనసాగుతున్నారు.
Updated on: Oct 07, 2024 | 10:00 PM

పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.

ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్‌లో స్లో అయినా.. నయన్ మాత్రం ఇప్పటికీ అదే జోరు మెయిన్‌టైన్ చేస్తున్నారు. ప్రజెంట్ సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకటం కష్టంగా ఉంది.

నయనతారనే తీసుకోండి.. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్‌కు డిమాండ్ పెరిగింది. జవాన్‌లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వరస ఆఫర్స్ అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత హాట్ షో మామూలుగా లేదు. రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి తర్వాత కూడా వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు.

అయితే బ్రహ్మాస్త్ర కన్నా ముందే, రణ్‌బీర్ - ఆలియా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించడానికి ఓకే చెప్పేశారట దీపిక పదుకోన్. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంటారా?

అలియా లేటెస్ట్ సినిమా జిగ్రాను తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ లాంటి హీరోలు సపోర్ట్ చేస్తున్నారు. ఇక కియారా అద్వానీకి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. గేమ్ ఛేంజర్ హిట్టైతే అమ్మడి జాతకం మారిపోవడం ఖాయం. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తుంది.




