- Telugu News Photo Gallery These are the changes that happen in the body if you eat okra, check here is details in Telugu
Okra Uses: బెండకాయ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. మిస్ చేయకండి!
బెండకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇవి కూడా కూరగాయల్లో ఒకటి. వారంలో ఒక్కసారైనా బెండకాయలను వండుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బెండకాయ గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఇదే మీ ఫేవరేట్ వెజిటేబుల్ అవుతుంది. బెండకాయలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఎ, బి, సి, కె1, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అయోడిన్ వంటి ఖనిజాలతో పాటు ఫ్లేవనాయిడ్లు..
Updated on: May 13, 2024 | 3:17 PM

బెండకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇవి కూడా కూరగాయల్లో ఒకటి. వారంలో ఒక్కసారైనా బెండకాయలను వండుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బెండకాయ గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఇదే మీ ఫేవరేట్ వెజిటేబుల్ అవుతుంది.

బెండకాయలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఎ, బి, సి, కె1, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అయోడిన్ వంటి ఖనిజాలతో పాటు ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. అదే విధంగా క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి.

బెండకాయలు తినడం వల్ల రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. బెండ కాయలతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే వీటిల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అదే విధంగా పొట్ట, పేగుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

బెండకాయలు తినడం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా తగ్గి.. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బెండకాయలను తరచూ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

బెండకాయలు తింటే శరీరంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా చర్మ సమస్యలను నివారిస్తుంది.





























