- Telugu News Photo Gallery Cinema photos Actress anasuya bharadwaj earned rs. 500 for ntr naaga movie
అనసూయ మొదట ఏ సినిమాలో కనిపించిందో తెలుసా..? అప్పుడు ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే
స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరో వైపు సినిమాలతో బిజీగా మారిపోయింది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ.
Updated on: May 13, 2024 | 3:41 PM

స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరో వైపు సినిమాలతో బిజీగా మారిపోయింది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ.

వయసు పెరుగుతున్న తరగని అందంతో హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది ఈ అందాల యాంకరమ్మ. ఇక నటన పరంగాను అనసూయ మంచి మార్కులు సొంతం చేసుకుంటుంది. రంగస్థలం సినిమాలో తన నటనతో కట్టిపడేసింది.

ఆతర్వాత పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ కెరీర్ బిగినింగ్ లో ఏం చేసేదో తెలుసా.. కాలేజ్ డేస్ లో ఉండగానే అనసూయకు సినిమాల పై ఆసక్తి కలిగిందట. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిందట.

జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి డబ్బులు సంపాదించిందట. మొదటి సారి ఎన్టీఆర్ నాగ సినిమాలో కనిపించింది అనసూయ. ఈ సినిమాలో సునీల్ మాట్లాడుతుంటే వెనకాల ఉండే స్టూడెంట్స్ లో అనసూయ ఉంటుంది. అప్పట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసినందుకు అనసూయకు 500 ఇచ్చారట. ఇప్పుడు ఆమె రేంజే వేరు.




