- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 16 Star and Tajikistani singer Abdu Rozik get engaged see Photos
అమ్మ బుడతడా..! పెళ్ళికి రెడీ అయిన బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్.. అమ్మాయి ఎవరంటే
అబ్దు రోజిక్.. ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నోడు చాలా ఫెమస్. సోషల్ మీడియాలో ఈ చిన్నోడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. అబ్దు ఓ సింగర్ కూడా.. అబ్దు రోజిక్ ఒక మరుగుజ్జు. ఆయన వయసు పెరుగుతున్న ఎత్తు మాత్రం పెరగలేదు. అయినా అతను ఎక్కడా కుంగిపోలేదు.. ఎంతో యాక్టివ్ గా.. సరదాగా సందడి చేస్తూ ఉంటాడు.
Updated on: May 13, 2024 | 2:46 PM

అబ్దు రోజిక్.. ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నోడు చాలా ఫెమస్. సోషల్ మీడియాలో ఈ చిన్నోడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. అబ్దు ఓ సింగర్ కూడా.. అబ్దు రోజిక్ ఒక మరుగుజ్జు. ఆయన వయసు పెరుగుతున్న ఎత్తు మాత్రం పెరగలేదు. అయినా అతను ఎక్కడా కుంగిపోలేదు.. ఎంతో యాక్టివ్ గా.. సరదాగా సందడి చేస్తూ ఉంటాడు

ఇక ఇప్పుడు ఈ బుడతడు పెళ్లికి రెడీ అయ్యాడు. తజికిస్థాన్‌కు చెందిన ఈ సింగర్ ఇప్పుడు. అబ్దు రోజిక్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. షార్జాకు చెందిన అమీరా అనే 19 ఏళ్ల యువతితో అబ్దుకు వివాహం జరగనుంది . అబ్దుకి ఇప్పుడు 20 ఏళ్లు. అమీరా అబ్దుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

అబ్దు డైమండ్ రింగ్ పట్టుకుని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 'నన్ను గౌరవించే, ప్రేమించే అమ్మాయి దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను' అని రోజిక్ అన్నారు.

మీ అందరికీ తెలిసినట్లుగా నా వయసు 20 ఏళ్లు. నేను ప్రేమలో పడాలనుకున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను గౌరవించాలి, అతిగా ప్రేమించాలి. అప్పుడు ఆ అమ్మాయి దొరికింది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ ఓ సర్ ప్రైజ్ ఉంది' అంటూ ఉంగరం విప్పి చూపించాడు.

అబ్దు రోజిక్ గాయకుడు , సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అతను తజికిస్థాన్‌కు చెందినవాడు. అతను 'బిగ్ బాస్ సీజన్ 16' (2022)లో పాల్గొనడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోమ్ కే ఖిలాడీ'లో అతిథిగా కనిపించాడు. ఇండియాలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి నెలలో అబ్దు చాలా వార్తల్లో నిలిచాడు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతన్ని విచారించారు.




