- Telugu News Photo Gallery Get relief from rashes and itching in summer, check here is details in Telugu
Skin Care in Summer: వేసవిలో వచ్చే ర్యాషెస్, దురద నుంచి ఇలా ఉపశమనం పొందండి..
వేసవిలో కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మం కమిలిపోవడం, రెడ్ ర్యాషెస్, దురద, చెమట కాయలు, కురుపులు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ఈ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటి నుంచి నేచురల్‌గా ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం. తులసి ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. తులసి ఆకులతో చర్మ ఆరోగ్యాన్ని..
Updated on: May 13, 2024 | 2:52 PM

వేసవిలో కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మం కమిలిపోవడం, రెడ్ ర్యాషెస్, దురద, చెమట కాయలు, కురుపులు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ఈ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటి నుంచి నేచురల్‌గా ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం.

తులసి ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. తులసి ఆకులతో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వీటిని నీటిలో వేసి కాసేపు ఉంచి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. దీంతో స్కిన్ ఇన్ ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.

సమ్మర్‌లో చర్మ సమస్యల్ని తగ్గించడంలో కలబంద ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కల బందలో కూడా చర్మ ఇన్ ఫెక్షన్లను దూరం చేసే గుణాలు ఉన్నాయి. వీటితో దురద, ర్యాషెస్, చెమట కాయలను తగ్గించుకోవచ్చు.

అదే విధంగా కొబ్బరి నూనెతో కూడా వేసవిలో వచ్చే చర్మ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. వేసవిలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నానం చేసే ఓ గంట ముందు శరీరానికి బాగా ఆయిల్ పట్టించి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది.




