- Telugu News Photo Gallery Technology photos How Overusing Power Banks Can Damages Your Phone, All You Need To Know
Tech Tips: పవర్ బ్యాంక్‌తో ఫోన్ ఛార్జింగ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోవడం గ్యారెంటీ..
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. నిరంతరం వాడకంతో ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా చాలా మంది పవర్ బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పవర్ బ్యాంక్‌లతో తరచుగా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వలన మీ పరికరం బ్యాటరీ జీవితకాలంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Oct 26, 2025 | 3:20 PM

ప్రతిసారీ పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లలో బ్యాటరీ సామర్థ్యం త్వరగా క్షీణించే అవకాశం ఉంది. పదే పదే పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ సెల్స్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా క్రమంగా ఫోన్ ఛార్జింగ్ వేగం, బ్యాటరీ జీవితకాలం రెండూ తగ్గుతాయి.

పవర్ బ్యాంక్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ ఛార్జింగ్ సమయం పరికరం వేడెక్కడానికి దారితీస్తుంది. వేడెక్కడం వల్ల బ్యాటరీతో పాటు ఫోన్ అంతర్గత భాగాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. తీవ్రమైన వేడెక్కడం ఫోన్ పనితీరును ప్రభావితం చేయడమే కాక అరుదుగా పేలుళ్లకు కూడా దారితీయవచ్చు.

ఏది ఎంచుకోవాలి..?అత్యవసర పరిస్థితుల్లో పవర్ బ్యాంక్ వాడకం తప్పనిసరైతే ఎల్లప్పుడూ బ్రాండెడ్, సర్టిఫైడ్ పవర్ బ్యాంక్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. మార్కెట్లో సర్క్యూట్ రక్షణ లేని అనేక చౌకైన, నకిలీ పవర్ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు. 12-లేయర్ సర్క్యూట్ రక్షణ, ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు సపోర్ట్ ఉన్న పవర్ బ్యాంక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇది మీ ఫోన్‌కు నష్టం కలిగించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పవర్ బ్యాంక్‌ను ఉపయోగించండి. బ్యాటరీ 20శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే ఛార్జ్ చేయడం ప్రారంభించండి. ఫోన్ 100శాతం ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ నుండి తీసివేయండి.

మీ ఫోన్‌ను రాత్రంతా ఛార్జ్ చేయకుండా జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాల కోసం మీ ఫోన్‌ను సురక్షితంగా ఎక్కువసార్లు ఛార్జ్ చేయగల 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల పవర్ బ్యాంక్‌ను ఎంచుకోండి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పవర్ బ్యాంక్ వాడకంలో ఈ భద్రతా చిట్కాలను పాటించడం ద్వారా తమ పరికరం బ్యాటరీ జీవితాన్ని కాపాడుకోవచ్చు.




