- Telugu News Photo Gallery Nike Project Amplify: Nike Unveils ‘World’s First Powered Footwear System’, Here’s How It Works
Nike Project Amplify: ఇక బైక్స్ అక్కర్లేదు.. ఈ షూ ఉంటే చాలు.. ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లొచ్చు..
Nike Project Amplify: ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ బైక్స్‌ను మీరు చాలానే చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎలక్ట్రిక్ షూస్‌ను చూశారా? లేదు కదా అయితే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి ఎలక్ట్రిక్ షూ వచ్చేస్తున్నాయి. ప్రముఖ క్రీడా వస్తువుల తయారీ కంపెనీ ఈ సరికొత్త పవర్డ్ ఫుట్‌వేర్ సిస్టమ్ ఎలక్ట్రిక్ షూను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త పవర్డ్ షూ మీ వేగాన్ని పెంచడంతో పాటు మీరు నడవడానికి అవసరమైన శ్రమను కూడా తగ్గిస్తుంది. ఇంతకు ఇవి ఎలా పనిచేస్తాయనేగా మీ డౌటు.. అయితే లేటెందుకు తెలుసుకుందాం పందండి.
Updated on: Oct 26, 2025 | 9:32 PM

ప్రఖ్యాత క్రీడా సంస్థ నైక్ ఈ సరికొత్త పవర్డ్ షూను తీసుకురాబోతుంది. నైక్ ప్రపంచంలోనే మొట్టమొదటి పవర్డ్ ఫుట్‌వేర్ సిస్టమ్ ప్రాజెక్ట్ యాంప్లిఫైని ప్రవేశపెట్టింది, ఇది నడక, పరుగు రెండింటినీ సులభతరం చేస్తుంది. ఈ షూ మీ వేగాన్ని పెంచడమే కాకుండా నడవడానికి అవసరమైన శ్రమను కూడా తగ్గిస్తుంది. నైక్ నుండి వచ్చిన ఈ కొత్త షూలో మోటారు, బెల్ట్, బ్యాటరీ అమర్చబడి ఉంటాయి, ఇది మీ ప్రతి అడుగును సూపర్‌ఛార్జ్ చేస్తుంది. (నైక్ ఇమేజ్)

ప్రాజెక్ట్ యాంప్లిఫై అనేది నైక్ చేపట్టిన అత్యంత వినూత్నమైన ప్రాజెక్ట్, దీనిని దాని రోబోటిక్స్ భాగస్వామి డెఫీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ షూ చీలమండ, పాదం సహజ కదలికను పెంచే వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇది తేలికపాటి మోటారు, డ్రైవ్ బెల్ట్, రీఛార్జబుల్ బ్యాటరీని షూలోని కార్బన్ ఫైబర్-ప్లేటెడ్ సోల్‌లో విలీనం చేయబడింది. మీరు దీన్ని రోబోటిక్ మోడ్‌లో లేదా సిస్టమ్ లేకుండా సాధారణ రన్నింగ్ షూగా కూగా వాడవచ్చు. (నైక్ ఇమేజ్)

ఈ షూను నైక్ స్పోర్ట్స్ రీసెర్చ్ ల్యాబ్ (NSRL) నుండి పరీక్ష డేటా ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే మోటారు, బ్యాటరీ ప్రతి అడుగుకు శక్తిని అందిస్తాయి. మనం నడవడానికి లేదా పరిగెత్తడానికి పడే శ్రమను తగ్గిస్తాయి. నైక్ గత కొన్ని సంవత్సరాలుగా దీనిని పరీక్షించింది, ఈ షూ ధరించి 400 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు 2.4 మిలియన్ అడుగులు పూర్తి చేశారు. (నైక్ ఇమేజ్)

ప్రాజెక్ట్ యాంప్లిఫై ఆలోచన ఒక సాధారణ ప్రశ్నతో ప్రారంభమైందని నైక్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ డోనాఘు అన్నారు: "అథ్లెట్లు తక్కువ శక్తితో ఎక్కువ దూరం ప్రయాణించడానికి మనం ఒక మార్గాన్ని సృష్టించగలమా? అనే ప్రశ్నతో ఈ ప్రాజెక్ట్‌కు పునాధులు పడినట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రజలకు సుదూర ప్రయాణాన్ని సులభతరం చేసినట్లే, ఈ షూ నడక, పరుగును ఆహ్లాదకరంగా, సులభంగా చేస్తుందని ఆయన వివరించారు. (నైక్ ఇమేజ్)

ఈ ప్రాజెక్ట్ యాంప్లిఫై ఇంకా పరీక్ష దశలో ఉంది. నైక్ ఇప్పటి వరకు దీని ప్రారంభ తేదీని వెల్లడించలేదు, కానీ రాబోయే కొన్ని సంవత్సరాలలోనే దీనిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. (నైక్ ఇమేజ్)




