- Telugu News Photo Gallery Spiritual photos Naivedyam Purity: What to do if fly or hair falls into food while preparing bhog for God
Bhog for God: దేవునికి తయారుచేసిన నైవేద్యంలో ఈగ లేదా వెంట్రుకలు పడితే ఏమి చేయాలంటే
హిందూ మతంలో పూజ సమయంలో దేవునికి ఆహారం సమర్పించడం ఒక సంప్రదాయం అని ప్రేమానంద మహారాజ్ వివరించారు. ఒకొక్క పండగకు.. ఒకొక్క దేవుడికి ఇష్టమైన ఆహరాన్ని భక్తిశ్రద్ధలతో తయారు చేసి.. దానిని నైవేద్యంగా సమర్పించి.. అనంతరం ఆ ఆహార పదార్ధాలను ప్రసాదంగా తీసుకుంటాం. అయితే ఇటీవల ఒక వ్యక్తి ప్రేమానంద మహారాజ్‌ను దేవునికి తయారుచేసిన నైవేద్యంలో ఈగ, వెంట్రుకలు లేదా మరేదైనా పడితే .. ఆ ఆహారాన్ని నైవేద్యం సమర్పించ వచ్చా అని అడిగాడు. అప్పుడు ప్రేమానంద మహారాజ్ చెప్పిన సమాధానం ఏమిటంటే..
Updated on: Sep 29, 2025 | 11:57 AM

దేవుని పూజ చేసిన తర్వాత ఆహారం సమర్పించడం ఆచారం. దేవతలకి పెట్టె నైవేద్యం చాలా పవిత్రంగా ఉండాలి. అంతేకాదు దేవుడికి సమర్పించే నైవేద్యాలను నిర్మలమైన మనసుతో అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేస్తారు. అయితే ఇలా ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎప్పుడైనా ఆహారంలో కీటకం లేదా వెంట్రుకలు పడితే.. ఆ ఆహారాన్ని ఏమి చేయాలి? నైవేద్యాన్ని మళ్ళీ తయారు చేయాలా వద్దా అనే విషయంపై ప్రేమానంద మహారాజ్ ఏమి చెప్పారో తెలుసుకుందాం.

దేవునికి తయారు చేస్తున్న నైవేద్యంలో అకస్మాత్తుగా ఒక ఈగ, పురుగు లేదా వెంట్రుకలు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలా వద్దా అని ప్రజలు సందిగ్ధంలో పడతారు. ప్రేమానంద్ మహారాజ్ ఈ గందరగోళ విషయానికి పరిష్కరాన్ని సూచించారు.

దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఆహారంలో వెంట్రుకలు, ఈగ లేదా మరేదైనా పడితే దానిని దేవునికి సమర్పించకూడదని ప్రేమానంద మహారాజ్ అన్నారు. నైవేద్యంలో ఏదైనా పడితే, దాని స్థానంలో కొత్తది సిద్ధం చేయాలని మహారాజ్ అన్నారు.

వాస్తవంగా ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని ఉండడం తప్పని.. అది కలియుగ లక్షణం అని చెప్పారు.. కనుక పూజ సమయంలో మాత్రమే కాదు.. దేవునికి నైవేద్యాలు తయారుచేసేటప్పుడు.. జుట్టును బాగా కప్పుకుని ఉంచుకోవాలని ప్రేమానంద మహారాజ్ జీ అన్నారు. అలాగే నైవేద్యాలు తయారుచేసేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండి తయారు చేయాలి. నైవేద్యాన్ని తయారు చేస్తూ.. మాట్లాడుతుంటే.. పొరపాటున మీ నోట్లో లాలాజలం నైవేద్యాలలో పడవచ్చు.

దేవునికి నైవేద్యాలు తయారుచేసేటప్పుడు స్వచ్ఛతను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మహారాజ్ వివరించారు. నైవేద్యాలు తయారుచేసే ముందు చేతులను బాగా కడుక్కోండి, నైవేద్యంలో ఈగ, వెంట్రుకలు లేదా ఏదైనా పడితే.. ఆ ఆహారాన్ని పారవేసే బదులుగా.. దానిని జంతువులకు లేదా పక్షులకు ఆహారంగా అందించవచ్చు అని చెప్పారు.




