- Telugu News Photo Gallery The influence of planet Ketu will bring good luck to the four zodiac signs during the festival
కేతువు ప్రభావం.. వీరికి పండగ వేళ చేతినిండా డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తులపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉంటే వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఒక వేళ ఏదైనా గ్రహం చెడు స్థానంలో ఉంటే ఆ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కేతువు గ్రహం నీచ స్థానంలో ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Updated on: Sep 28, 2025 | 2:00 PM

ముఖ్యంగా అన్ని గ్రహాల్లో కెళ్లా, కేతువు, రాహు గ్రహాలను కీడు గ్రహాలు అంటారు. ఇవి చాలా వరకు అన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్నే చూపుతాయి. చాలా తక్కువ సమయంలో మాత్రమే ఇవి శుభఫలితాలనిస్తుంటాయి. అయితే కొన్ని రాశుల వారికి పండగ సమయంలో కేతువు గ్రహం అదృష్టాన్ని ఇవ్వబోతుంది. దీని వలన మూడు రాశుల వారికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.

శక్తివంతమైన గ్రహాల్లో కేతువు గ్రహం కూడా ఒకటి. అయితే ఈ గ్రహం ఇప్పుడు శుభ స్థానంలో ఉండబోతుంది. దీని వలన మూడు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపరం పరంగా అనేక ప్రయోజనాలు అందనున్నాయి. మరి 12 రాశుల్లో ఏ రాశుల వారిపై కేతు గ్రహం తన అనుగ్రహాన్ని చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారిపై కేతువు అనుగ్రహం ఉంటుంది. దీని వలన ఈ రాశి వారికి వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.

కన్యా రాశి : కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనల లాభం కలుగుతుంది. అలాగే చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి కేతువు అనుగ్రహంతో అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారికి కూడా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చును.



