- Telugu News Photo Gallery These are the problems caused by drinking water immediately after drinking tea
టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?
టీని చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇక కొంత మంది టీ తాగడానికి ముందు నీళ్లు తాగితే, మరికొందరు మాత్రం టీ తాగిన తర్వత వెంటనే నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Updated on: Sep 28, 2025 | 1:59 PM

శరీరంలోని ఆల్కలైన్, యాసిడ్లు నిద్ర తరవాత కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే వేడి టీ తాగే అలవాటు వాటిని మరింత ప్రభావితం చేసి, జీవక్రియా రేటును తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలంలో జీర్ణసంబంధిత సమస్యలు మొదలవుతాయి.

ఇక కొందరు టీని ఒక్కసారి తాగితే, మరికొంత మంది మాత్రం రోజుకు రెండు లేదా, మూడు సార్లు టీ తాగుతుంటారు. అయితే టీ తాగడం మంచిదే అయినప్పటికీ, టీ తాగినప్పడు మాత్రం కొన్ని పొరపాట్లు అస్సలే చేయకూడదంట. ముఖ్యంగా టీ తాగిన తర్వాత అస్సలే చల్లటి పానియాలు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా చిన్న పిల్లలకు టీ అస్సలు ఇవ్వకూడదు. వేడి టీ తాగడం జీర్ణవ్యవస్థకు మరింత ప్రమాదకరం. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి ఈరోజే వేడి టీ తాగే అలవాటు మానేయడం మంచిది. అలాగే భోజనం తర్వాత టీ తాగడం కూడా చాలా చెడ్డ అలవాటు. చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది. అయితే ఈ అలవాటు అంత మంచిది కాదు.

పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి, దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇలా వేడి వేడి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రతికూలంగా పని చేస్తుంది. అనేక వ్యాధులకు దారితీస్తుంది.



