- Telugu News Photo Gallery Spiritual photos Good planet in 3rd house to bring great success for these zodiac signs details in telugu
Success Horoscope: తృతీయ స్థానంలో అనుకూల గ్రహం.. ఈ రాశుల వారికి అద్భుత విజయాలు..!
Telugu Astrology: జాతక చక్రంలో తృతీయ స్థానం ప్రయత్నాన్ని, వృద్ధిని సూచిస్తుంది. సమస్యల పరిష్కారానికి కూడా ఇదే అవకాశం కల్పిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ తృతీయ స్థానానికి జాతక చక్రంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం గ్రహాల స్థితిగతుల రీత్యా కొన్ని రాశుల వారికి వారి తృతీయ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి వారు ఏ దిశలో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది
Updated on: Oct 12, 2024 | 12:29 PM

జాతక చక్రంలో తృతీయ స్థానం ప్రయత్నాన్ని, వృద్ధిని సూచిస్తుంది. సమస్యల పరిష్కారానికి కూడా ఇదే అవకాశం కల్పిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ తృతీయ స్థానానికి జాతక చక్రంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం గ్రహాల స్థితిగతుల రీత్యా కొన్ని రాశుల వారికి వారి తృతీయ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి వారు ఏ దిశలో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఏ విధమైన విజయం లేదా పరిష్కారం లభిస్తుంది అన్న విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశులకు వారి ప్రయత్నాలు ఫలించడంతో పాటు వారు ఆశించిన అభివృద్ధి, పురోగతి అనుభవానికి వస్తాయి.

మేషం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఈ నెల 20 వరకు కుజ సంచారం వల్ల ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాల వృద్ధి తప్ప కుండా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సోదరులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని శుభ వార్తలు వింటారు. ఈ కుజుడు రాశ్యధిపతి అయినందువల్ల ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు.

సింహం: ఈ రాశికి తృతీయంలో బుధ సంచారం వల్ల మూడు వారాల పాటు వృత్తి, వ్యాపారాల్లో అంచనా లకు మించిన వృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలు వంటివి బాగా లాభిస్తాయి. ఆస్తి, గృహం, వ్యాపార ఒప్పందాలకు కుదర్చుకోవడానికి బాగా అనుకూల సమయం. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. కొద్ది చొరవ, ప్రయత్నంతో వ్యక్తిగత పురోగతి ఉంటుంది.

కన్య: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల విదేశాలకు వెళ్లాలన్న కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయ వంతం అవుతాయి. ఆదాయ ప్రయత్నాల్లో రెట్టింపు ఫలితాలుంటాయి. గృహ, వాహన ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సమస్యలు చాలావరకు పరిష్కారమై, సామరస్యం, అన్యోన్యత బాగా వృద్ధి చెందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ ఏడాదంతా శని సంచారం వల్ల కొద్దిగా ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, ఆదాయ ప్రయత్నాలకు శని సంచారం పూర్తిగా అనుకూలం. విద్యార్థులు కొద్ది శ్రమతో చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు వంద శాతం విజయవంతం అవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శ్రమ ఉన్నప్పటికీ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ ఏడాదంతా రాహు సంచారం వల్ల వ్యాపార ఒప్పందాలు, ఆస్తి ఒప్పందాలు విజయవంతం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు బాగా మెరుగుపడతాయి.

మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ ఏడాదంతా గురు గ్రహ సంచారం వల్ల ఆదాయ వృద్ధికి సంబం ధించిన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్ప కుండా విజయవంతం అవుతాయి. సోదరులతో సమస్యలు, వివాదాలు పరిష్కారం అవు తాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. వివాదాల్లో మీ మధ్యవర్తిత్వాలు సత్ఫలితానిస్తాయి.



