AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhana Yoga: ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగాలు..! ఇందులో మీ రాశి ఉందా?

ప్రస్తుతం ఆరు రాశులకు ధన స్థానాలు బలంగా ఉన్నాయి. దాదాపు సెప్టెంబర్ ఆఖరు వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. రాశినాథుడే ధన స్థానంలో ఉండడం, ధన స్థానాన్ని శుభ గ్రహాలు బలంగా వీక్షించడం జరుగుతున్నందువల్ల ఈ రాశులకు ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందడం జరుగుతుంది. లక్ష్మీ యోగం, మహా భాగ్య యోగం, కుబేర యోగం వంటివి పట్టే అవకాశం ఉంది. రాశినాథుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించి తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ప్రస్తుతం ధన స్థానం బాగా అనుకూలంగా ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 31, 2025 | 4:13 PM

Share
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలో సంచారం చేస్తుండడంతో పాటు గురువుతో కలిసి ఉన్నందువల్ల కొద్దిపాటి ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నెల రోజుల పాటు ఏ ఆదాయ ప్రయత్నమైనా అంచనాలకు మించిన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. సంపాదన బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది. వీరికి ధన యోగాలతో పాటు మహా భాగ్య యోగం కూడా పడుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో సంచారం చేస్తుండడం, రవితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం కలిగింది. ఆగస్టు చివరి లోగా ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు అనుకూల సంచారం చేస్తుండడంతో పాటు, ధన స్థానంలో కేతువు ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సెప్టెంబర్ చివరి లోగా విదేశీ సంపాదనను అనుభవించే యోగం కూడా కలుగుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. వార సత్వ సంపద లభించే సూచనలు కూడా ఉన్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.

3 / 6
సింహం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన కుజుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారం వరకు వీరి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. భూలాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ  పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్నిమించుతాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల లబ్ధి పొందుతారు.

4 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం, ధన స్థానాన్ని గురు, శుక్రులతో పాటు కుజుడు కూడా వీక్షించడం వల్ల వీరికి అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. రావలసిన డబ్బును, బాకీలను, బకాయిలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు, అదనపు రాబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది.

5 / 6
కుంభం: రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడంతో పాటు ధన స్థానాధిపతి గురువు శుక్రుడితో కలిసి పంచమంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడే అవకాశం ఉంది. మరో రెండేళ్ల పాటు వీరి ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలే కాక, కుటుంబ సమస్యలు కూడా చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మదుపులు, పెట్టుబడుల వల్ల అంచనాలకు మించిన ధన లాభాలు కలుగుతాయి. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

6 / 6