దాదాపు 19 కంపెనీలకు యజమాని అయిన రాకేష్ ఝున్‌జున్‌వాలా 1960లో హైదరాబాద్‌లో జన్మించారు. ముంబైలో ఆయనకు చాలా ఇళ్లు ఉన్నాయని చెబుతున్నారు. మలబార్ హిల్స్‌లో రూ.176 కోట్ల విలువైన 6 ఫ్లాట్లను తీసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇది కాకుండా రాకేష్‌కు లోనావాలాలో ఖరీదైన బంగ్లా కూడా ఉంది. ఆస్తులను అమ్మడం, కొనడం చేసే ఈ బిగ్‌బుల్‌కు బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి.