- Telugu News Photo Gallery Health Benefits Of Consuming Sabja Seeds In Morning In Telugu Lifestyle News
ఆడవాళ్లు సబ్జా గింజలు తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..
సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటి వినియోగం, లాభాలు దాదాపు మనందరికీ తెలిసిందే. అందుకే ఇటీవలి కాలంలో సబ్జా సీడ్స్ పలు రకాల జ్యూస్‌లు, స్మూతీస్‌లలో ఎక్కువగా వాడుతున్నారు. అయితే, వీటిని సమ్మర్‌లో తీసుకోవటం వల్ల వేడి నుండి ఉపశమనం కలిగిస్తుందని తెలుసు.. కానీ, ఈ సబ్జా గింజలను సరైన మోతాదులో అన్ని కాలల్లోనూ తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. శీతాకాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత ప్రయోజనం అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 13, 2025 | 7:15 AM

సబ్జా గింజల్లో ప్రోటీన్స్, కాల్షియం,మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. దీని వలన ఎముకలు ధృడంగా ఉంటాయి. మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

సబ్జా గింజలు తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగితే ఫలితం ఉంటుంది. తలనొప్పి తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.

శీతాకాలంలో సబ్జాగింజలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో మనం తీసుకునే ఆహారం అంత త్వరగా జీర్ణం కాదు..ఎందుకంటే, చలికారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీంతో తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. జీర్ణ సమస్యలు రావు. ఇందులో ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.

ప్రోటీన్, ఐరన్ , మెగ్నీషియం, కాల్షియం,విటమిన్ కె సబ్జాగింజల్లో అధికంగా ఉండటం వలన జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టు సమస్యలు తగ్గుతాయి. సబ్జా గింజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారడం తగ్గతుంది. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.

బరువు తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది సబ్జా గింజలు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ,కె, సి తో పాటు మినరల్స్, కాల్షియం,మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలు తీసుకోవడం వలన జీర్ణ శక్తి మెరుగవుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం అలవాటు చేసుకుంటే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి.. నల్లని జుట్టును పొందవచ్చు.





























