మీరు ఉపయోగించిన గుడ్డు పెంకులను చెత్తబుట్టలో పడేయడానికి బదులుగా, మీరు పెంచే మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందుకోసం గుడ్డు పెంకులను నీటితో శుభ్రంగా కడిగి, ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మొక్కల మట్టిలో కలిపి ఉపయోగిస్తే మొక్క ఏపుగా పెరుగుతుంది. వీటిలో కాల్షియం, ఇతర మినరల్స్ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.