Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..

సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ ఉంటే..బాక్సాఫీస్ ద‌గ్గర క‌నిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది బాలకృష్ణ మూవీ ఒక్కటి కూడా రిలీజ్‌కాకపోవడంతో..మంచి ఆకలిమీద ఉన్నారు ఎన్‌బీకే ఫ్యాన్స్‌. దీంతో ఈ పండగకు ‘డాకు మ‌హారాజ్’గా ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు బాలకృష్ణ.

Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..
Daaku Maharaj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2025 | 7:20 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ..దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా..బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాంబినేషన్‌ ఆస‌క్తిని రేకెత్తించడంతో పాటు విడుదలకు ముందే అడియన్స్ ముందుకు వచ్చిన ట్రైలర్స్‌ కూడా జనాన్ని అట్రాక్ట్‌ చేశాయి. దీంతో సినిమాను చూసేందుకు ఇటు కుటుంబ ప్రేక్షకులు..అటు అభిమానులు పోటీ ప‌డ్డారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అయితే తాము ఊహించినట్టే సినిమా సూపర్ డూపర్ హిట్‌ అంటున్నారు..ఫ్యాన్స్‌. మూవీ సక్సెస్‌మీట్‌లో అభిమానులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు..ప్రొడ్యూసర్‌ నాగవంశీ.

బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా “డాకు మహారాజ్‌”కు హిట్‌ టాక్‌ ఇస్తున్నారు. ఎప్పటిలాగే బాలయ్య తన అద్భుతమైన నటనతో అలరించాడని..మాస్ డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నీ పెర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెబుతున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న పాజిటివ్ టూక్‌తో ఖుషీగా ఉంది..మూవీ యూనిట్‌. “డాకు మహారాజ్‌”కు మంచి ప్రేక్షకాదరణ వస్తుండడంతో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది మూవీ టీమ్‌. నిర్మాత నాగవంశీతోపాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా ఈ మీట్‌లో పాల్గొని..సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని చెప్పారు నిర్మాత నాగవంశీ. త్వరలోనే వేడుక ఉంటుందన్నారు. ఈ నెల 17న తమిళం, హిందీలో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నామని చెప్పారు. “డాకు మహారాజ్”మూవీకి ప్రీక్వెల్ ఉంటుందంటూ ప్రేక్షకులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు నిర్మాత నాగవంశీ. దీంతో మరింత ఖుషీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్‌.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..