శని గ్రహం రింగ్స్ ఎప్పుడు ఏర్పడ్డాయో తెలుసా?
TV9 Telugu
13 January
202
5
దుంప రకాలకు చెందిన క్యారెట్, బీట్‌రూట్‌ల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే. క్యారెట్, బీట్‌రూట్ మిక్స్‌డ్ జ్యూస్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
బీట్‌రూట్‌లోని నైట్రేట్స్ రక్తనాళాలను తెరిచి గుండెకు మేలు చేస్తాయి. రెండిటిలోనూ లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కీళ్ల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు రావు. బీట్‌రూట్, క్యారెట్లలో పీచుపదార్థం ఎక్కువ. దాంతో జీర్ణసంబంధమైన సమస్యలు తగ్గుతాయి.
బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఉదరంలో మంచి బ్యాక్టీరియా బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఇందులోని పోషకాలతో పాటు విటమిన్-ఎ, సి రోగ నిరోధకశక్తిని పెంచి… ఇన్ఫెక్షన్లను తరిమికొడతాయని అంటున్నారు.
సహజమైన డీటాక్స్ గుణం వల్ల కాలేయం లాంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మపు రంగు మెరుగుపడుతుందనీ… ఓ కొత్త మెరుపు వస్తుంది.
అయితే మితిమీరి తాగితే మాత్రం షుగర్ స్థాయి పెరగడం, మూత్రం ఎరుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు రావచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా?
ఎండు కొబ్బరితో లాభాలు తెలిస్తే షాక్..
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు..