Lemon: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎక్కువ లేదా మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా పాడవుతాయి. దీనిని నివారించడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఇది ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

Lemon: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా?
Lemon
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 5:49 AM

నిమ్మకాయను లెమన్ జ్యూస్ చేయడానికి, బిర్యానీ వంటి వాటిల్లో పిండుకోడానికి.. ఇతర వంటకాల్లో వినియోగిస్తూ ఉంటాం.  అంతేకాక ఇంట్లోని అనేక వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రుచి సాధారణంగా అందరికీ ఇష్టం. అందం నుంచి ఆరోగ్యం వరకు అన్నింట నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కాకుండా నిమ్మకాయను కోసి ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. సాధారణంగా మనం ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిజ్‌లో భద్రపరుస్తాం. ఈ క్రమంలో ఫ్రిజ్ నీట్‌గా ఉండటం చాలా ముఖ్యం. దీనికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఫ్రిజ్ నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 

ఫ్రిజ్లో చెడు వాసన ఉండదు

సాధారణంగా ఫ్రిజ్ పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు దుర్వాసన సమస్య తలెత్తుతుంది.  ఈ వాసన కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహార పదార్థాలలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ దుర్వాసన సమస్య నుంచి బయటపడేందుకు సులభమైన మార్గం నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచడం. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగిస్తుంది. ఇది సహజంగా గాలిని తాజాగా ఉంచుతుంది.

ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది:

చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ కొన్ని పదార్థాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా పాడైపోతాయి. అలాంటి వాటిని నిమ్మకాయతో ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడి, ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి. కానీ రిఫ్రిజిరేటర్‌లో ఉంచడానికి ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించండి.