Andhra Ports: పోర్ట్‌ల భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు
సీజ్ ది షిప్..అన్న వర్డ్ వినిపించగానే మనకు వినిపించేది ఏపీడిప్యూటీ పవన్ కళ్యాణ్ పేరు..కనిపించేంది పీడీఎస్ బియ్యం అక్రమరవాణా. టన్నుల కొద్దీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నా పట్టించుకునే నాదుడేలేకుండా పోయాడు. కారణం పోర్టుల్లో భద్రతా వైఫల్యం. అందుకే ఏపీ సర్కార్ పోర్టుల భద్రతపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం కలిసి...పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది 12 శాఖలను సమన్వయం చేస్తూ..మైనర్ పోర్టుల భద్రతకు మార్గదర్శకాలు రూపొందించింది.
పోర్ట్‌ల భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించింది. 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మర్చంట్ షిప్పింగ్ రూల్స్ ఆధారంగా ఈనిబంధనలను ప్రవేశపెట్టారు. మైనర్ పోర్టుల భద్రతను పర్యవేక్షించేందుకు పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇందులో భాగంగా కమిటీలో 12శాఖలకు చెందిన ప్రతినిధులు ఉంటారు, కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు భద్రతా సమీక్షలు జరుగుతుంటాయి, ప్రతి ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
పోర్ట్ సెక్యూరిటీ కమిటీ విభాగంలో..పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ ఆఫీసర్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కేంద్ర నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF, స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్, ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్, భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ , రాష్ట్ర మేయరిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్….ఇలా 12శాఖలకు చెందిన సభ్యులు ఫోర్స్‌లో ఉంటారు. మైనర్ పోర్టుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. CEO హాజరు కాలేకపోతే, సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి సమావేశాలు జరగాలి. భద్రతా పరమైన ఆందోళనలు ఉంటే ఎక్కువ సార్లు నిర్వహించుకోవచ్చు.
కమిటీ ఏర్పాటుతో, మైనర్ పోర్టుల భద్రతపై గట్టి పర్యవేక్షణ ఉంటుంది. కస్టమ్స్, నార్కోటిక్స్, నిఘా సంస్థలు, నావికాదళం వంటి కీలక సంస్థలు పాలుపంచుకోవడం వల్ల రహదారులు, పోర్టుల ద్వారా జరిగే నేరాలను గుర్తించడంలోనూ, ఇల్లీగల్ రవాణా నివారించడంలో సమర్థత పెరుగుతుంది.. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పోర్టుల భద్రతను నిర్లక్ష్యం చేయకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ లను ఏర్పాటు చేసింది. వాణిజ్య, రక్షణ, మానవ వనరుల పరిరక్షణ కోసం మైనర్ పోర్టుల భద్రతను కఠినతరం చేయాలంటే PFSAC ఏర్పాటు తక్షనావసరంగా ప్రభుత్వం భావిస్తోంది.
కమిటీ ఏర్పాటువల్ల అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని.. సమావేశాల నివేదికలను సమయానుకూలంగా సమీక్షించుకోవడమే గాక… మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానంలో మరిన్ని పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది…కొత్త మార్గదర్శకాల అమలుతో ఆంధ్రప్రదేశ్ మైనర్ పోర్టుల భద్రత కొత్త స్థాయికి చేరుతుందని..ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..