Andhra News: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్నేళ్లుగా వేర్వేరు వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Andhra News: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
CM Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2025 | 12:11 AM

ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వివిధ వర్గాలకు 6700 విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలను మీడియాకు వివరించారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రూ.519 కోట్లు జీపీఎఫ్‌ పెండింగ్‌ బకాయిలు, సీపీఎస్‌కు రూ.300 కోట్లు, TDS కింద రూ.260 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.788 కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు.

రూ.10 లక్షలలోపు పెండింగ్ బిల్లులు విడుదల.. 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్ల చెల్లింపు

వీటితో పాటు రూ.10 లక్షలలోపు బిల్లులు పెండింగ్ ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు చెల్లించబోతున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 651 చిన్న కంపెనీలకు రూ.90 కోట్ల ఇన్సెంటివ్ చెల్లించనున్నామన్నారు. విద్యుత్‌శాఖకు పెండింగ్ బిల్లుల కోసం రూ.500 కోట్లు చెల్లించడంతో పాటు NTR వైద్యసేవా కింద రూ.400 కోట్లు విడుదల చేస్తామన్నారు పయ్యావుల. మెడిసిన్స్ కోసం రూ.100 కోట్లు విడుదల చేయడంతో పాటు రైతులకు కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు.

రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అనేక వర్గాలకు లబ్ది చేకూరేలా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. పడిపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..