Papikondalu: సంక్రాంతి సెలవుల వేళ.. పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు
సంక్రాంతి సెలవులు కావడంతో... పాపికొండలు పర్యటనకు పోటెత్తారు పర్యాటకులు. బంధుమిత్రులు, స్నేహితులతో కలసి బోట్‌లో ఎంజాయ్ చేస్తూ పాపికొండలు చేరుకుంటున్నారు. పాపికొండలు యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో పుల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
గోదావరికి ఇరువైపులా ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించేందుకు తరలివెళ్తున్నారు పర్యాటకులు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి బంధు మిత్రులతో కలిసివచ్చి… రాజమండ్రిలోని పోచమ్మ గండి పాయింట్ నుంచి బోటులో పాపికొండలు చేరుకుంటున్నారు. పండుగను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
గత నాలుగు రోజుల నుంచి పాపికొండలుకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వరుస సెలవులు కావడంతో సరదాగా బోటు ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు రామయ్య దర్శనం కోసం వెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు 14 బోట్లలో దాదాపు వెయ్యి మంది పర్యాటకులు పాపికొండలు వెళ్లారు. అయితే పండుగ సందర్భంగా రష్ పెరగడంతో పలువురు నిరాశకు గురవుతున్నారు. వెంటనే బోట్లు నిండిపోవడంతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుందని.. పర్యాటకశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి పెట్టాలని కోరుతున్నారు. కనీసం సెలవులు, పండుగ సీజన్లలోనైనా సర్వీసులు పెంచాలంటున్నారు.
మొత్తంతా ఈ వారమంతా రద్దీ ఉంటే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..