Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..

వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయి..? వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి..

Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2025 | 7:31 PM

పట్నం.. పల్లె బాట పట్టింది.. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి నెలకొంది.. మూడు రోజుల పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది.. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిచేందుకు అందరూ సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది..

ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య – తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ :-

సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..