AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varicose Veins in Women: ఆ సమయంలో మహిళల కాళ్లపై రక్తపు చారలు ఎందుకు? భయం వద్దు.. ఇలా చేయండి

మహిళల్లో సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య మెనోపాజ్‌ సంభవిస్తుంది. ఈ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ హార్మోన్ల మార్పుల వల్ల అలసట, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, తలనొప్పి, జుట్టు రాలడం వంటి అనేక ఇతర చర్మ సమస్యలను..

Varicose Veins in Women: ఆ సమయంలో మహిళల కాళ్లపై రక్తపు చారలు ఎందుకు? భయం వద్దు.. ఇలా చేయండి
Causes Of Varicose Veins
Srilakshmi C
|

Updated on: Oct 23, 2025 | 10:16 AM

Share

మెనోపాజ్‌ అనేది ఒక జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది. ఈ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ హార్మోన్ల మార్పుల వల్ల అలసట, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, తలనొప్పి, జుట్టు రాలడం వంటి అనేక ఇతర చర్మ సమస్యలను సైతం కలిగిస్తాయి. మరికొంతమంది మహిళలకు వెరికోస్ వెయిన్స్ అంటే వారి కాళ్ళలో ఆకుపచ్చ సిరలు వంటివి కూడా కనిపిస్తాయి. అయితే మహిళల్లో కనిపించే వెరికోస్ వెయిన్స్ కు మెనోపాజ్ కారణమా? ఇలా ఎందుకు జరుగుతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

మెనోపాజ్‌ సమయంలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల మార్పులు సంభవిస్తాయని గైనకాలజిస్టులు అంటున్నారు. దీని కారణంగా, మహిళలు వెరికోస్ వెయిన్స్ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో కాళ్ళలో ఆకుపచ్చ రంగు సిరలు కనిపిస్తాయి. సిరల కవాటాలు బలహీనంగా లేదా దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. దీంతో శరీర ఉపరితలంపై ఆకుపచ్చ సిరలు కనిపిస్తాయి. శరీరంలో రక్తం సరిగ్గా ప్రసరించకుండా గుండెలో రక్తం పేరుకుపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య తలెత్తుతుంది.

మెనోపాజ్‌ తర్వాత వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏమిటి?

మెనోపాజ్‌ సమయంలో మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుందని అందరికీ తెలుసు. ఈ మార్పులు మహిళల్లో వెరికోస్ వెయిన్స్ రావడానికి దారితీస్తాయి. మెనోపాజ్‌ సమయంలో మహిళల శరీరంలోని హార్మోన్లలో మార్పులు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు, రక్త నాళాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది వాటిని బలహీనపరిచి వెరికోస్ వెయిన్స్ కు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కొన్నిసార్లు మెనోపాజ్ సమయంలో శరీరంలో జరిగే మార్పుల కారణంగా చాలా మంది మహిళలు బరువు పెరుగుతారు. ఇది రక్త నాళాలను కూడా ప్రభావితం చేసి వెరికోస్ వెయిన్స్‌కు దారితీస్తుంది. ఇది తరువాత మహిళలకు అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. కొంతమందికి కాళ్ళలో నొప్పి, వాపు, సిరల చుట్టూ దురద, మోకాళ్ల చుట్టూ చర్మం రంగు మారడం వంటి వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెనోపాజ్ సమయంలో శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాలలో తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?