కిడ్నీల్లో రాళ్లున్న వారు ఉసిరి తింటే ఏమవుతుందో తెల్సా?

13 December 2025

TV9 Telugu

TV9 Telugu

ఇది ఉసిరికాయల సీజన్‌. వీటితో ఊరగాయ, రోటిపచ్చడి, పప్పు, రసం ఏది చేసినా వారెవా అనిపిస్తుంది. పుల్లపుల్లటి ఆమ్లాతో వంటలు రుచే కాదు ఆరోగ్యం కూడా. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి

TV9 Telugu

ఎ, సి, ఇ విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, సోడియం, పీచు, ప్రొటీన్లతో ఆమ్లా మంచి పోషకాహారం. చుండ్రు, వెంట్రుకలు చిట్లడం, రాలడం, పిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు చెక్‌పెట్టినట్లవుతుంది

TV9 Telugu

కుదుళ్లు గట్టిపడి కురులు ఒత్తుగా, నల్లగా ఉంటాయి. ఉసిరిలో పెక్సెల్స్ ఆమ్లాలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది

TV9 Telugu

వీటిల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు కూడా దండిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా  శీతాకాలంలో ఉసిరిని విరివిగా తీసుకుంటారు. కొందరు దీనిని పచ్చిగానే తింటారు. మరికొందరు ఉసిరి జ్యూస్‌ తయారు చేసుకుని తాగడానికి ఇష్టపడతారు

TV9 Telugu

నిజానికి ఉసిరిని ఈ రెండు విధాలుగా తినవచ్చు. అయితే జ్యూస్‌ కన్నా నమిలి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఫలితాంగా అన్ని పోషకాలు నేరుగా అందేలా చేస్తుంది

TV9 Telugu

దంతాలు, దవడలకు కూడా వ్యాయామం అందిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, జలుబు ఉన్నవారు ఉసిరి తినకపోవడమే మంచిది

TV9 Telugu

నారింజ కంటే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. చర్మంపై ముడతలు నివరిస్తుంది