- Telugu News Photo Gallery Latest Weather Report: IMD says Heavy rains in Andhra Pradesh for next 3 days Details Here
Rain Alert: వర్షాలే.. వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
మరో అల్పపీడనం హడలెత్తిస్తోంది.. నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
Updated on: Nov 10, 2024 | 1:25 PM

నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల అవర్తనము.. ఆదివారం నవంబరు 10వ తేదీ 2024 ఉదయం 08.30 గంటలకు సగటు సముద్ర మట్టానికి 3.6 కి. మీ ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులలో ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదులుతుంది.

నైరుతి బంగాళాఖాతం నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల ఆవర్తనం నుంచి ఉన్న ద్రోణి మధ్య ట్రోపో ఆవరణము వరకు విస్తరించి కొనసాగుతుందని.. భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. రాబోవు మూడు రోజులకు వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - యానాం:- ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట సంభవించే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:- ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.




