వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే, శరీరంలోకి తక్కువ నూనె వెళ్తుంది. బదులుగా వండిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. చేపలు, మాంసం, గుడ్లు వంటి ఆహారాలను తక్కువ నూనె, మసాలాలతో ఆవిరితో ఉడికించి తినవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆహారంలో వంటనూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు.